ఎవరి కోసమీ ప్రేమయుద్ధం!!

ఎవరి కోసమీ ప్రేమయుద్ధం!!
x
Highlights

ప్రేమ. రెండక్షరాల పదం. యుగాలు మారినా... తరాలు మారినా తరగని కమ్మని మధురం. కులం, మతం అన్నిటికీ అతీతమైనది. భాషలు, భావాలు ఏవైనా మారని మంత్రం ప్రేమ. అసలు...

ప్రేమ. రెండక్షరాల పదం. యుగాలు మారినా... తరాలు మారినా తరగని కమ్మని మధురం. కులం, మతం అన్నిటికీ అతీతమైనది. భాషలు, భావాలు ఏవైనా మారని మంత్రం ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏమిటి? ఈ ప్రేమకి రోజేంటి? మన సంప్రదాయం కాదని ఒకరు... బాధైనా భరిస్తామని ఇంకొకరు.. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్‌ డేపై ఎందుకింత దుమారం?

ప్రేమికులకీ రోజేంటి? ఆలోచిస్తే నవ్వు వచ్చే విషయం ఇది.. మనకు నచ్చిన వారిని మనం ప్రతిరోజూ ప్రేమిస్తూనే ఉంటాం... వారితో కలిసి జీవిస్తూనే ఉంటాం.. వారిని రోజూ ఆరాదిస్తూనే ఉంటాం.. అలాంటప్పుడు ప్రత్యేకంగా ప్రేమికుల రోజు అవసరం ఏంటి అనుకుంటాం.. కానీ ప్రేమికులకు మాత్రం వాలెంట్సైడే ఎంతో ప్రత్యేకం.. రోజూ వినే మాటలైనా.. ఆరోజు కొత్తగా వినాలనుకుంటారు.. రోజూ కలిసే మనిషే అయినా ఆరోజు కలిసి తిరగడం ప్రత్యేకంగా భావిస్తారు.. రోజూ వ్యక్తపరిచే ప్రేమే అయినా.. ప్రేమికుల రోజున చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతారు..

కానీ ఈ ప్రేమికుల రోజుపై కొన్నేళ్ల నుంచి రాద్ధాంతం జరుగుతుంది. వివాదం రాజుకుంటుంది. మనది కాని రోజుకు ఎందుకింత ప్రాధాన్యమంటూ వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌లు భగ్గుమంటున్నాయి. ఎక్కడి నుంచో వచ్చిన సంప్రదాయాన్ని మనం ఆచరించడమేంటంటూ మండపడుతున్నాయి. అందుకే ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ఎవరైనా ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో ఏకాంతంగా కనిపిస్తే వారిని పట్టుకొని పెళ్లిళ్లు చేసేస్తున్నారు. జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రపంచం మొత్తాన్నీ తనకు అభిమానులుగా మార్చేస్తుందని. తాను మరణించిన రోజు వాలెంటైన్స్‌డేగా ప్రేమికులకు అంకితం అవుతుందని. వాలెంటైన్ తన చివరి సందేశాన్ని రాసిన రావి ఆకు ఆధారంగా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారని చెబుతుంది చరిత్ర. వాలెంటైన్‌ ఆకారాన్ని హృదయంగా భావించి, దాని ఆకారాన్ని హృదయాకారంగా, ప్రేమకు గుర్తుగా స్థిరపరిచారని చెప్పుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories