ఖమ్మం నడిబొడ్డున మారిన రాజకీయం ఏం చెబుతుంది?

ఖమ్మం నడిబొడ్డున మారిన రాజకీయం ఏం చెబుతుంది?
x
Highlights

ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన జిల్లా ఖమ్మం. తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి దిగ్గజ రాజకీయ నేతలు...

ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన జిల్లా ఖమ్మం. తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి దిగ్గజ రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించారు. చైతన్యానికి గుమ్మంగా ఉన్న ఖమ్మం పార్లమెంటు స్థానం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గానిది ఎప్పుడూ ప్రత్యేకమే. 1952 నుంచి ఇప్పటి దాకా జరిగిన ఎన్నికల్లో ఖమ్మం ఎటువైపు నిలుచుంది? ఏ పార్టీకి పట్టం కడుతుంది.?

1952లో ఖమ్మం లోక్‌సభ స్థానం ఏర్పడగా,అప్పటి నుంచి చాలా రోజుల పాటు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్యే రాజకీయ వైరం నడిచింది. తొలుత పీడీఎఫ్, ఆ తర్వాత సీపీఐ, అనంతరం సీపీఎం, సీపీఐఎంఎల్‌ (న్యూడెమొక్రసీ) పార్టీలు ఇక్కడి ప్రజలను వామపక్ష ఉద్యమాల వైపు నడిపించాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఖమ్మం పార్లమెంటు పరిధిలో రాజకీయం కొంత మారుతూ వచ్చింది. కొన్నాళ్లు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పోరాటం జరగ్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో మాత్రమే విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బలం చేకూరింది.

2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లే ప్రధాన ప్రత్యర్థులు. కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడిపోయినప్పటికీ సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగి ఉందనే నమ్మకంతో సిపిఐ మద్దతుతో సిపిఎం అభ్యర్థిని పోటీలో నిలుపుతోంది.ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ స్వరూపం అటు భౌగోళికంగానూ, ఇటు రాజకీయంగానూ వైవిధ్యభరితం. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకునెలవైన ఖమ్మం మెట్టమొదలు, అందమైన అటవీ ప్రాంతాలతో కూడిన అశ్వారావుపేట, సింగరేణి పుట్టినిల్లు కొత్తగూడెం నియోజకవర్గాలుఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాంతం గ్రానైట్‌ పరిశ్రమకు పుట్టినిల్లు. ఇక్కడ∙తయారయ్యే టైల్స్, శ్లాబ్స్, స్టోన్‌లనుజపాన్, అమెరికా, జర్మనీ, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారు. సింగరేణి కాలరీస్, కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (కేటీపీఎస్‌), ఐటీసీ పేపర్‌ లిమిటెడ్‌ లాంటి పరిశ్రమలకు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. మామిడి, జీడి, కొబ్బరి, నిమ్మ, అరటి, జామ, ఆయిల్‌పామ్‌ తోటలకు ప్రసిద్ధి.వరి, మొక్కజొన్న, పత్తి, చిరుధాన్యాలు, చెరకు పంటలను పండిస్తారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కే నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ, కిన్నెరసాని, మున్నేరు, ఆకేరు, వైరా నదులు ప్రధాన నీటి వనరులు.1952లో ఖమ్మం లోక్‌సభ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 11 సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలుపొందారు.

1962 నుంచి 1996 వరకు ఏకంగా 34 ఏళ్ల పాటు 8సార్లు వరుసగా కాంగ్రెస్‌ గెలిచింది. రాష్ట్రం విడిపోయాక జరిగిన తొలి ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు స్థానంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటింది. ఖమ్మం లోక్‌సభ స్థానంతో పాటు ఈ స్థానం పరిధిలోకి వచ్చే అశ్వారావుపేట, వైరా అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిచింది. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ ఉద్దండులైన నామా నాగేశ్వరరావు, సీపీఐ నారాయణను ఢీకొని విజయం సాధించారు. ఈసారి రాజకీయాలు మారడంతో చైతన్యవంతమైన ఓటర్లు ఉన్న ఖమ్మం పార్లమెంటు స్థానంలో తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories