సహస్ర చండీ మహా యాగం ఏం చెబుతోంది?

సహస్ర చండీ మహా యాగం ఏం చెబుతోంది?
x
Highlights

హోమానికి ప్రధాన వస్తువు అగ్ని. మంత్రోచ్ఛరణ అగ్నిలో దేవతా ద్రవ్య పదార్థాలు అందించడం ద్వారా గొప్ప ప్రక్షాళన జరుగుతుందన్నది నమ్మకం. అది మనసుపై, మనిషిపై...

హోమానికి ప్రధాన వస్తువు అగ్ని. మంత్రోచ్ఛరణ అగ్నిలో దేవతా ద్రవ్య పదార్థాలు అందించడం ద్వారా గొప్ప ప్రక్షాళన జరుగుతుందన్నది నమ్మకం. అది మనసుపై, మనిషిపై మంచి ప్రభావం చూపిస్తుంది. హోమ ఆచరణ ద్వారా గొప్ప స్థాయికి ఎదగడం.. మనసు ప్రశాంతత పొందడం సాధ్యపడుతుందంటారు రుత్వికులు. అలాంటి హోమమే మహా రుద్ర సహిత సహస్ర చండీయాగం. ఈ యాగం ఎలా చేస్తారు? దాని ఫలితాలేంటో చూద్దాం.

శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి ఆశీస్సులతో, శృంగేరి శారదాపీఠం సంప్రదాయంలో జరుగుతుంది మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం. ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో జరిగే సహస్ర చండీ యాగంలో తొలి రోజు వంద సప్తశతి చండీ పారాయణాలు, రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 పారాయణాలు చేస్తారు. ఇలా అన్నీ కలిపితే వెయ్యి పారాయణలవుతాయి. ఐదో రోజు 11 యజ్ఞ కుండాల వద్ద.. ఒక్కో యజ్ఞ కుండం వద్ద 11 మంది రుత్విక్కులతో 100 పారాయణాల స్వాహాకారాలతో హోమం నిర్వహిస్తారు. పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమవుతుంది.

వాస్తవానికి యజ్ఞాలు చేయడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటారు పండితులు. ఎలా అంటే యజ్ఞం చేసేపుడు అగ్ని హోమాలు చేసి అందులో నెయ్యి, పాలు, ధాన్యం, ఆవు పేడ పిడకలు, జిల్లేడు, మోదుగ, దర్భ, గరిక వృక్షాల కట్టెలు వేస్తుంటారు. ఆజ్యాన్ని పోయడం వల్ల పొగ వస్తుంది. అది మంచి ఆరోగ్యానికి సహకరింస్తుంది. నేతిని అగ్నిలో వేయడం వల్ల వచ్చే ధూమం వల్ల యాగశాల చుట్టుపక్కల వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. తద్వారా స్వచ్చమైన గాలి అందుతుంది. హాని చేసే సూక్ష్మక్రిములు నశిస్తాయి.

అంతే కాదు... యాగాలలో వాడే ద్రవ్యపదార్థాల వల్ల ప్రకృతిలో చాలా మార్పులు జరుగుతాయి. సూక్ష్మంలో మోక్షం అనే విధంగా మన చుట్టు ఉండే ప్రకృతిలోని పదార్థాలను ఉపయోగించి ఆయా దేవతలకు హవిస్సు ఇస్తారు. కలియుగ నియమం ప్రకారం దేవతలు నేరుగా హవిస్సు తీసుకోరు. అగ్నిదేవుడు మనం యజ్ఞాల ద్వారా ఇచ్చే హవిస్సును ఆయా దేవతలకు అందిస్తారు. దానితో వారు సంతోషించి యజ్ఞ ఫలితాన్ని అందిస్తారంటున్నారు రుత్వికులు.

Show Full Article
Print Article
Next Story
More Stories