కార్గిల్ ప్రత్యేకం: యుద్ధం ఎందుకు జరిగింది?

కార్గిల్ ప్రత్యేకం: యుద్ధం ఎందుకు జరిగింది?
x
Highlights

అది ఎముకలు కొరికే చలి.. రక్తం గడ్డ కట్టే మైనస్ ఉష్ణోగ్రతలు.. ఏ మాత్రం సహకరించని వాతావరణం అయితేనేం పైకి స్నేహ గీతం పాడుతూ విచ్చు కత్తితో ...

అది ఎముకలు కొరికే చలి.. రక్తం గడ్డ కట్టే మైనస్ ఉష్ణోగ్రతలు.. ఏ మాత్రం సహకరించని వాతావరణం అయితేనేం పైకి స్నేహ గీతం పాడుతూ విచ్చు కత్తితో వెన్నుపోటు పొడిచిన పాకిస్థాన్ దమన నీతిపైనే మన సైనికుల గురి..ప్రాణాలు పోతున్నా చివరి వరక శత్రు సైన్యాన్ని మట్టు పెట్టడమే వారి విహిత కర్తవ్యం. అదే కిల్లర్ ఇన్ స్టింక్ట్ వారికి విజయాన్ని తెచ్చి పెట్టింది.

సరిగ్గా 11 ఏళ్ల క్రితం అంటే 1999 మే_జూలై మధ్య కాలంలో ఆ ప్రాంతంలో సైనిక కాల్పులతో దద్దరిల్లిపోయింది. రక్తం ఏరులై పారింది. భారత్‌ను దొంగ దెబ్బ తీయాలనుకున్న పాకిస్థాన్‌ గూబ గుయ్‌‌మనేలా భారత్ సైన్యం బుద్ధి చెప్పింది. మూడు నెలల పాటు జరిగిన హోరాహోరి పోరులో చివరికి పాక్ సైన్యం తోక ముడిచింది. మే నెలలో కొంత మంది పాక్ సైనికులు, కాశ్మీర్ తీవ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటుకొని లోపలికి చొరబడ్డారు. మొదట్లో ఇది జీహాదీల పోరాటమని అంతా భావించారు. అయితే కొన్ని రోజుల్లోనే పాకిస్థాన్ అసలు బండారం బయటపడింది. అప్పటి పాకిస్థాన్ సర్వపైన్యాధిపతి పర్వేజ్ ముషార్రఫ్ కార్గిల్‌‌పై పట్టు సాధించడానికి చేసిన పన్నాగాలు బయటపడ్డాయి.

దీంతో భారత్ అప్రమత్తమైంది. అప్పటికే పాక్ సైన్యం మన భూభాగంలో 200 కి.మీ. మేరకు ఆక్రమించేసింది. అయినా భారత్ సర్వశక్తులు ఒడ్డి పాక్‌ను ఢీకొంది. దాదాపు 30 వేల మంది సైనికులు మోహరించి అమీతుమీకి సిద్ధపడ్డారు. మేజర్ జనరల్ వేద్‌ ప్రకాష్ మాలిక్ నేతృత్వంలోని భారత వీరజవాన్లు ప్రాణాలకు తెగించి మరీ పోరాడారు. ఈ పోరాటంలో 527 మంది మరణించారని, 1,363 మంది గాయపడ్డారని భారత్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ లెక్కలు మరో విధంగా ఉన్నాయి. 4 వేల మంది వరకు మరణించారని ఆ దేశం లెక్కలు కట్టింది. 665 మందికి పైగా గాయాల పాలయ్యారని చెబుతోంది. అణుబాంబులు కలిగియున్న రెండు దేశాల మధ్య జరిగే యుద్ధాలలో కార్గిల్ రెండోది. అంతకు ముందు 1969లో చైనా, సోవియట్ యూనియన్‌ల మధ్య యుద్ధం జరిగింది. అణు పరిజ్ఞానం కలిగిన రెండు దేశాల మధ్య ఆగకుండా పోరుజరగడంతో అంతర్జాతీయంగా కలకలం రేగింది. జీ_8 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌లు భారత్‌కు పూర్తిగా మద్దతునిచ్చాయి. పాక్ దుష్టపన్నాగాలను తీవ్రంగా ఖండించాయి. పాకిస్థాన్‌కు దీర్ఘకాలిక మిత్రదేశమైన చైనా కూడా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని గట్టిగా చెప్పింది. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, తానే స్వయంగా వెళ్లి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కలుసుకొని మద్దతు కోరినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అంతర్జాతీయంగా ఒత్తిడి తీవ్రం కావడంతో పాక్ సైన్యం తోక ముడిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories