మోడీ మైండ్ గేమ్ కి కాంగ్రెస్ కంగు తిందా?

మోడీ మైండ్ గేమ్ కి కాంగ్రెస్ కంగు తిందా?
x
Highlights

ఒకే ఒక్క వ్యాఖ్య మండుటెండల్లో చెమటోడ్చి ప్రచారం చేస్తున్న రాహుల్, ప్రియాంకల కష్టాన్ని నీరు గారుస్తోందా? ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకునే టైమ్ లో...

ఒకే ఒక్క వ్యాఖ్య మండుటెండల్లో చెమటోడ్చి ప్రచారం చేస్తున్న రాహుల్, ప్రియాంకల కష్టాన్ని నీరు గారుస్తోందా? ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకునే టైమ్ లో మోడీ అదను చూసి దెబ్బ కొట్టారా? మోడీ మైండ్ గేమ్ కి కాంగ్రెస్ కంగు తిందా? ఇంతకీ ఏంటా వ్యాఖ్య..

2019 ఎన్నికల ప్రచారం పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లతో వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కొన్నాళ్లుగా తీవ్రమైన ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మోడీ ఈ ఎమోషనల్ గేమ్ లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకునేలా చేశారు. సిక్కుల ఊచకోతకు, భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి రాజీవ్ గాంధీయే కారణమంటూ ఘాటైన విమర్శలు చేశారు. మోడీ విమర్శలను ఖండించే క్రమంలో కాంగ్రెస్ నేత, రాహుల్ సన్నిహితుడు శ్యామ్ పిట్రోడా అయిందేదో అయిపోయింది. అయితే ఏంటంటూ నోరు జారారు. సిక్కుల ఊచకోతపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మొత్తం ఎన్నికల ప్రచారాన్నే ఓ కుదుపు కుదిపేశాయి.

పిట్రోడా వ్యాఖ్య ఎన్నికల ప్రచార సరళిలో మోడీదే పై చేయిగా మార్చింది. పిట్రోడా వ్యాఖ్యలను ఎక్కడికక్కడ ప్రస్తావిస్తూ సిక్కుల పట్ల కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని ఎద్దేవా చేశారు మోడీ. ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ ఈ వ్యాఖ్యలను పెద్దవిగా చేసి చూపడంతో కాంగ్రెస్ కి జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోయింది. మొదట పిట్రోడాను సమర్ధించిన కాంగ్రెస్ నేతలు సైతం ఈ అభిప్రాయంతో తాము ఏకీభవించబోమని చెప్పాల్సి వచ్చింది.

మరోవైపు పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో రగడ మొదలైంది. పంజాబ్ లో సిక్కు సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిం చాయి. పిట్రోడా వ్యాఖ్యలను నిరసిస్తూ ఎక్కడికక్కడ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం పిట్రోడా వ్యాఖ్యలను తప్పుబట్టారు. పిట్రోడా కామెంట్లు పంజాబ్ లో కాంగ్రెస్ కు తీరని నష్టం కలిగించేవిగా మారడంతో కాంగ్రెస్ తామా వ్యాఖ్యలను సమర్ధించడం లేదంటూ దూరం జరిగింది. ఓ వైపు రాహుల్, మరో వైపు ప్రియాంక గెలుపు కోసం శ్రమిస్తుంటే పిట్రోడా కామెంట్ తో ఆ శ్రమంతా వృథా అయిపోయిందన్న విమర్శలు రేగుతున్నాయి. కాంగ్రెస్ ను నైతికంగా దెబ్బ తీయడంలో మోడీ వ్యూహం ఫలించినట్లే కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories