Top
logo

మద్య మాంస ప్రియుడు... ఆంజనేయుడు... ఇంట్రెస్టింగ్‌ స్టోరీ

మద్య మాంస ప్రియుడు... ఆంజనేయుడు... ఇంట్రెస్టింగ్‌ స్టోరీ
X
Highlights

తెలంగాణలో గ్రామ దేవతలకు మందు, మాంసం నైవేద్యంగా పెట్టి కొలవడం ఆనవాయితీ. కానీ, అక్కడ ఆంజనేయస్వామికి కూడా...

తెలంగాణలో గ్రామ దేవతలకు మందు, మాంసం నైవేద్యంగా పెట్టి కొలవడం ఆనవాయితీ. కానీ, అక్కడ ఆంజనేయస్వామికి కూడా సంక్రాంతి పండగ సందర్భంగా మూడురోజులపాటు నాన్‌వెజ్ నైవేద్యాలు సమర్పిస్తారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై.. తమ ఇష్టదైవమైన ఆంజనేయస్వామికి మాంసం, కల్లు, మద్యం నైవేద్యంగా అందిస్తుంటారు. మరి ఆ ఆంజనేయుడెక్కడ..? ఆంజనేయుడికి మద్యం, మాంసం నైవేద్యమేంటి?

వనపర్తి జిల్లాలోని చింతలకుంట ఆంజనేయస్వామి గుడి. పెబ్బేరు మండల కేంద్రానికి 8కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపల్లి గ్రామ సమీపంలో ఉంది. ఈ ఆలయానికి దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ మొక్కుకుంటే తమ కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. దీంతో ప్రతి ఏటా భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే, ఆంజనేయుడు అంటే ఎక్కడైనా తమలపాకులతో అలంకరణ చేసి, వివిధ రకాల స్వీట్లతో నైవేద్యం సమర్పిస్తారు. కానీ, ఇక్కడ డిఫరెంట్. ఆంజనేయస్వామికి శాఖాహారం బదులు.. మాంసాహారాన్ని నైవేద్యంగా అందిస్తారు భక్తులు. కోళ్లు, మేకలు,పొట్టేళ్లు బలిచ్చి.. వాటి మాంసంతో ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా మూడురోజులపాటు జాతర జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ.

ఈ గుడి చుట్టూ చింతచెట్లు, పక్కనే ఓ నీటి కుంట ఉండేదని అందువల్ల చింతల కుంట ఆంజనేయస్వామి అని పేరు వచ్చిందని చెప్పారు ఆలయ అర్చకులు. భక్తుల కోర్కెలు తీరుతుండటంతో ఆ నోటా, ఈ నోటా ప్రచారం జరిగి స్వామివారు వెలుగులోకి వచ్చారంటున్నారు. చూశారుగా...ఈ ఆంజనేయస్వామికి నాన్ వెజ్ మొక్కులు చెల్లించేందుకు స్థానికులే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలివస్తున్నారు భక్తులు.

Next Story