అసెంబ్లీలో ఉభయసభలపై గళం విప్పిన గవర్నర్‌

అసెంబ్లీలో ఉభయసభలపై గళం విప్పిన గవర్నర్‌
x
Highlights

తెలంగాణ రాష్ట్రం వృద్ధిరేటులో ముందంజలో ఉందన్నారు గవర్నర్ నరసింహన్ . మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్.

తెలంగాణ రాష్ట్రం వృద్ధిరేటులో ముందంజలో ఉందన్నారు గవర్నర్ నరసింహన్ . మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్. గత నాలుగున్నరేళ్లలో నీటిపారుదల రంగానికి 77 వేల 777 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాబోయే కాలంలో లక్షా 17 వేల కోట్ల విలువైన పనులు చేస్తామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఆదర్శంగా ఉందన్నారు గవర్నర్ నరసింహన్. మిషన్‌ కాకతీయ సత్ఫలితాలిచ్చిందని తెలిపారు. ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కళ్యాణలక్ష్మి పథకం దేశానికి ఆదర్శమన్నారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పారదర్శక విధానాలు అమలవుతు న్నాయన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం తీసుకొచ్చామన్నారు. రైతుబంధు పథకాన్ని ఆర్థికవేత్తలు, వ్యవసాయవేత్తలు ప్రశంసించారని గవర్నర్ తెలిపారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

ఐటీ రంగం అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గవర్నర్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మార్చి నాటికి మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాల్లో ఇంటింటికి నల్లా నీరు సరఫరా చేస్తామని చెప్పారు. నిర్దేశించుకున్న సమయానికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

ఆదివారం తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగనుంది. ఉదయం 10.30 గంటలకు కొప్పుల ఈశ్వర్ చర్చను ప్రారంభిస్తారు. వేముల ప్రశాంత్‌ రెడ్డి బలపర్చనున్నారు. అటు శాసనమండలిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి చర్చ ప్రారంభిస్తారు. బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రసంగాన్ని బలపర్చనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories