తొలి ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా?

తొలి ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా?
x
Highlights

స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల చిత్రాలు ఎన్నో. మాములుగా ఐదారు లేదా ఏడెనిమిది దశల్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగించేస్తారు. ఈసారి ఏడు దశల్లో...

స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల చిత్రాలు ఎన్నో. మాములుగా ఐదారు లేదా ఏడెనిమిది దశల్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగించేస్తారు. ఈసారి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నికలు ఎలా జరిగాయి... ఎన్ని దశల్లో జరిగాయి? చూద్దాం. 2019 లోక్‌సభ ఎన్నికలు రెండు నెలల పాటు ఏడు దశల్లో జరుగుతున్నాయంటేనే.. ఇంత టైమా అనుకుంటున్నాం. మరి మొట్టమొదటి ఎన్నికలు ఏకంగా 68 దశల్లో సుమారు నాలుగు నెలల పాటు జరిగాయి. 1951 అక్టోబరు నుంచి 1952,ఫిబ్రవరి వరకు ఆ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఎన్నికల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా 3000 సినిమా హాళ్లలో డాక్యుమెంటరీలు ప్రదర్శించారు. రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం ప్రతినిధులు కూడా ఇంటింటికీ తిరిగి ఓటు వేయమని ప్రజలను కోరారు.

మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి దేశంలో 85శాతం ప్రజలు నిరక్షరాస్యులు. అప్పుడున్న 40కోట్ల జనాభాలో కేవలం 15శాతం మందికి మాత్రమే ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వచ్చు. దాంతో ఓటర్లు రాజకీయ పార్టీల పేర్లను, అభ్యర్థ్ధుల పేర్లను చదవడం, గుర్తు పెట్టుకోవడం కష్టమని భావించిన ఈసీ సుకుమార్‌ సేన్‌ రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించాలని నిర్ణయించారు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీకి నాగలి దున్నుతున్న జోడెద్దుల గుర్తు వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ చిహ్నమైన హస్తం మొదటి ఎన్నికల్లో నేతాజీ పార్టీా అయిన ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్ పార్టీకి దక్కింది.

ఈ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేయడానికి 16వేల మందికిపైగా సిబ్బంది ఆరు నెలల పాటు తిరిగారు. ఓటర్ల జాబితా తయారయ్యాక పేరు లేకపోవడంతో 28 లక్షల ఓటర్ల పేర్లను తొలగించాల్సి వచ్చింది. అప్పట్లో మహిళలు బయటివారికి తమ పేరు చెప్పేవారు కాదు. ఫలానా వారి భార్యననో, కూతురిననో, చెల్లెలిననో చెప్పడంతో సిబ్బంది అలాగే రాసుకోక తప్పలేదు. అలాంటి పేర్లను జాబితా నుంచి తొలగించేశారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు, అభ్యర్థులకు ప్రచారం ఎలా చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. నెహ్రూ వంటి నేతలు బహిరంగ సభలు పెట్టి ఓట్లు అడిగేవారు. కొందరు ఇళ్లకు వెళ్లి అభ్యర్థించేవారు. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఎస్‌సిలకు కేటాయించిన ఉత్తర మధ్య బొంబాయి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీఆర్‌ అంబేద్కర్‌ ఓడిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories