ఆ నెత్తుటి మరకకు ఆరేళ్లు... పాఠాలు నేర్చుకున్నామా?

ఆ నెత్తుటి మరకకు ఆరేళ్లు... పాఠాలు నేర్చుకున్నామా?
x
Highlights

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు జరిగి నేటికి ఆరేళ్లు పూర్తవుతుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉగ్రవాదుల దుశ్చర్య ఘటనను ఇప్పటికీ నగర వాసుల్ని...

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు జరిగి నేటికి ఆరేళ్లు పూర్తవుతుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉగ్రవాదుల దుశ్చర్య ఘటనను ఇప్పటికీ నగర వాసుల్ని వెంటాడుతూనే ఉంది.. ఆ నెత్తుటి మరకలను మర్చిపోలేక పోతున్నారు. 2013 ఫిబ్రవరి 21.. సమయం సాయంత్రం 6 గంటల 45 నిమిషాలు..హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ కోణార్క్ థియేటర్... ప్రజలు రద్దీగా ఉన్నారు.. ఎవరి పనుల్లో వారు ఉన్న సమయంలోనే వెంట వెంటనే జంటపేలుళ్లు జరిగాయి.. ఏం జరిగిందని తెలుసుకునే లోపే ఆ ప్రాంతమంతా రక్తపు మడుగులతో చేతులు కాళ్లు తెగి విరిగిపడిన వారి హహాకారాలు..ఆర్తనాదాలతో బీతిల్లిపోయింది. ఈ ఘటనలో 17 మంది అమాయకులు మృత్యువాత పడటంతో పాటు వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనతో హైదరాబాద్ ఉలిక్కిపడింది.

దిల్ సుఖ్ నగర్ వరుస పేలుళ్లు జరుగున తర్వాత ప్రభుత్వం..పోలీసులపై తీవ్ర విమర్శలు రావడంతో ఆఘమేఘాలపై జాతీయ దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు - సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించిన ఎన్ ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దిన్ సహా వ్వస్థాపకుడు.. మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది యాసిన్ భత్కల్ తో పాటు అసదుల్లా అక్తర్., తహసీన్ అక్తర్, జియావుర్ రెహ్మాన్, ఎజాకి షాయిక్ ను ఈ పేలుళ్లకు పాల్పడినట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో 157 మంది సాక్షులను విచారించింది ఎన్ఐఏ కోర్టు.. 502 డాక్యుమెంట్స్ సేకరించారు.. 201 మెటీరియల్ ను సీజ్ చేసింది.. స్పెషల్ కోర్టులో నేరం నిరూపణ కావడంతో నిందితులకు ఉరిశిక్ష విధించింది కోర్టు..అలాంటి చీకటి రోజు రానే వచ్చింది. నగర వాసుల్ని ప్రాణభయంతో వణికి పోయేలా చేసిన జంటపేలుళ్లు జరిగి సరిగ్గా ఇవ్వాల్టికి ఆరేళ్లు పూర్తయ్యాయి.. ఫిబ్రవరి 21 వచ్చిందంటే చాలు జంటపేలుళ్ల ఘటన గుర్తు చేసుకుంటూ ఆరోజు జరిగిన పరిస్ధితి ద్రిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories