నార్త్‌ ప్లాన్‌... సౌత్‌లో వర్కవుట్‌ అవుతుందా.. మోడీ, షా లెక్కలు ఏం చెబుతున్నాయి?

నార్త్‌ ప్లాన్‌... సౌత్‌లో వర్కవుట్‌ అవుతుందా.. మోడీ, షా లెక్కలు ఏం చెబుతున్నాయి?
x
Highlights

మోడీ, షా లెక్కలు... ఎవరివి వారికున్నాయి. ఎవరి ఎత్తుగడలు వాళ్లవే. ఎవరి వ్యూహాలు వారివే. కానీ అంతిమ లక్ష్యం మాత్రం ఇద్దరివి ఒక్కటే. ఫైనల్‌...

మోడీ, షా లెక్కలు... ఎవరివి వారికున్నాయి. ఎవరి ఎత్తుగడలు వాళ్లవే. ఎవరి వ్యూహాలు వారివే. కానీ అంతిమ లక్ష్యం మాత్రం ఇద్దరివి ఒక్కటే. ఫైనల్‌ డెస్టినేషన్‌... హస్తిన పీఠం. కానీ ఈ లెక్కలు సౌత్‌లో పారుతాయా? ప్రాంతీయ పార్టీల హవా బలంగా వీచే దక్షిణాది రాష్ట్రాల్లో ఎదురునిలిచి, గెలిచే సత్తా ఉందా? అయితే అధికార పార్టీ... లేదంటే ప్రతిపక్షం... ఈ రెండింటికే పట్టం కట్టే పరిస్థితుల నుంచీ కమలానికి పట్టంకట్టే రోజులు వస్తాయా? ఉత్తరాది సక్సెస్‌ ఫార్ములా దక్షిణాదిలో వర్కౌటవుతుందా? ఉత్తరాది, దక్షిణాది అనే చర్చ ఇప్పుడెందుకు వస్తోందంటే, రాజకీయ పార్టీలు అలాగే ఆలోచిస్తున్నాయి కాబట్టి. అక్కడ ఎన్నికల్లో ఏయే వ్యూహాలైతే అఖండ విజయాన్నిచ్చాయో అచ్చం అలాంటి స్ట్రాటజీనే సౌత్‌‌లో అప్లై చేయాలని ప్లాన్‌ చేస్తున్నాయి. కేవలం ఆలోచనలే కాదు, భౌతికమైన రూపాలను దక్షిణాదిలో వాడాలని రకరకాలుగా తలపోస్తున్నాయి. అందుకు తాజా నిదర్శనం బీజేపీ యూపీ ఫార్ములాను యాజీటీజ్‌గా సౌత్‌లోనూ అప్లై చేయాలనుకోవడం.

వాస్తవానికి... ఉత్తరం.. దక్షిణం రెండూ వేరైనట్టే, సంస్కృతులు వేరు...సాంప్రదాయాలు వేరు. భాషలు, ఆచారాలు వేరు. నేపథ్యాలు, ఉద్యమాలు వేరు. కానీ భిన్నత్వంలో ఏకత్వానికి అసలైన నిదర్శనం. దేశమంతా ఒక్కటేనన్న భావనతో పయనం. ప్రాంతీయ అభిమానం రెండు దిక్కుల్లోనూ బలంగా ఉండటం వాస్తవం. అసలు ఉత్తరాది పార్టీ అయిన కాంగ్రెస్‌ మీద కసితోనే దక్షిణాదిలో అన్నాడీఎంకే, డీఎంకే, తెలుగుదేశం వంటి పార్టీలుపుట్టుకొచ్చాయి. హిందీ భాషను దక్షిణాదిలో బలవంతంగా రుద్దుతున్నారన్న ఆవేశంతో ద్రవిడ ఉద్యమాలు నడిచాయి. ఇప్పటికీ దక్షిణాదిలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ అక్కడక్కడ మెరుస్తోంది. ఇక బీజేపీ ఉనికి అంతంత మాత్రం. కానీ ఉత్తరాది నుంచి దక్షిణాపథం వరకు రాజ్యాన్ని విస్తరించాలని మోడీ, షా ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగానే నార్త్‌ ఫార్ములాను అప్లై చేస్తున్నారు.

యూపీలో అనేక పార్టీల నుంచి ముఖ్య నేతలను పార్టీలోకి లాగారు అమిత్‌ షా. ఇప్పుడు ఏపీలోనూ పర్యటించిన షా... ముఖ్య నేతలకు వల వేసే ఆలోచనలో ఉన్నట్టు, వలసలు, కులమత సమీకరణలు, బూత్‌స్థాయి మీటింగ్‌లతో పాగావెయ్యాలని స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాది ప్రజల ఆలోచనలకు, మరీ దక్షిణాది ప్రజలు... అందునా.... ఏపీ ప్రజల ఆలోచనకు చాలా చాలా తేడా ఉంది. పార్టీల పరిస్థితులు కూడా వేరు. అక్కడి ఫార్ములా ఇక్కడ వర్కౌట్ కావడం కూడా కష్టమేనంటున్నారు విశ్లేషకులు. సంస్కృతీ, సంప్రదాయాల్లోనూ ఎంతో వైరుధ్యమన్న దక్షిణాదిలో ఉత్తరాది సూత్రం సక్సెస్‌ అవుతుందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభంజనం వీచిన సమయంలోనూ, ఎన్టీఆర్‌ నార్త్‌లో పార్టీని విస్తరించాలనుకున్నారు. కానీ సక్సెస్‌ కాలేకపోయారు. ఇప్పుడు ఉత్తరభారతాన్ని జయిస్తున్న పార్టీలు, దక్షిణాదిలో పాగా వెయ్యాలనుకుంటున్నాయి. ఉత్తరాది పాలకులు దక్షిణాదివారిపై వివక్షచూపుతున్నారని ఎప్పటి నుంచో అభిప్రాయముంది. పీవీ విషయంలో అది కనపడింది కూడా. ఈ క్రమంలో మరోసారి ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో సక్సెస్‌ అవుతాయా అన్న డిస్కషన్‌ మొదలైంది. మోడీ అభివృద్ది మంత్రతో సౌత్‌లో పాగా వేయాలన్నది కాషాయం స్కెచ్‌. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అసలైన ప్రత్యామ్నాయం తామేనన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది కమలం ఆలోచన. మరి ఎలాంటి వ్యూహాలతో ముందుకుపోవాలో కాషాయశ్రేణులకు ఇప్పటికే కర్తవ్యబోధ కూడా జరిగింది. ఇక మిగిలింది కార్యాచరణే. మరి కమలం స్ట్రాటజీ సక్సెస్‌ అవుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories