వాడిన పూలే వికసిస్తాయా... కమలాన్ని గెలిపించే గుర్రాలేవి?

వాడిన పూలే వికసిస్తాయా... కమలాన్ని గెలిపించే గుర్రాలేవి?
x
Highlights

దేశవ్యాప్తంగా పూలు వికసిస్తున్నాయి. మొన్నటి వరకూ తెలంగాణలో పువ్వులు పుష్పించాయి. కానీ మొన్న అసెంబ్లీ పోరులో మాత్రం, పువ్వులన్నీ నలిగిపోయాయి. అందుకే...

దేశవ్యాప్తంగా పూలు వికసిస్తున్నాయి. మొన్నటి వరకూ తెలంగాణలో పువ్వులు పుష్పించాయి. కానీ మొన్న అసెంబ్లీ పోరులో మాత్రం, పువ్వులన్నీ నలిగిపోయాయి. అందుకే బయటకు రావడానికి భయపడుతున్నాయ్. తరుముకొస్తున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి, పువ్వు గుర్తు పార్టీకి, గెలుపు గుర్రాలు కరువయ్యారు.కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. పలు రాష్ట్రాల్లోనూ పవర్‌లో ఉంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉంది. మోడీ, అమిత్ షాలు ప్రచారం కూడా మొదలుపెట్టారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమకు అనుకూలమైన వాతావరణం ఉందని అంటున్నారు. అయితే తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలోకి నిలిచే, పెద్ద నేతలు ఎవరూ కనిపించడం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే కనీసం ప్రభావం చూపెట్టే నేతలు కూడా వెతికినా దొరికే పరిస్థితి లేదు.

17 స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నా, బీజేపీకి ఒకటి రెండు స్థానాల్లో మాత్రమే అంతోఇంతో ప్రభావం చూపెట్టే వ్యక్తులు పోటీలో ఉండే అవకాశం ఉంది. మిగతా స్థానాల్లో ప్రస్తుతానికి ఆ స్థాయి నేతలు లేరనే అభిప్రాయం పార్టీలోనే వ్యక్తమవుతోంది. 2009లో అన్ని స్థానాలకు పోటీ చేసిన బీజేపీ, చాలా స్థానాల్లో నామ్‌కే వాస్తే అభ్యర్థులకు టికెట్స్ ఇచ్చింది. 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ, మంచి అభ్యర్థులనే బరిలోకి దించింది. ఈసారి మాత్రం అలాలేదు. 2014లో బీజేపీ నుంచి పోటీ చేసిన నాగం జనార్దన్ రెడ్డి, నరేంద్రనాథ్‌లు పార్టీని వీడారు. విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా వెళ్లారు.

ఈసారి ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కొత్త ముఖాలే బరిలోకి దిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఫలితాల దెబ్బతో, ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల్లో పార్లమెంట్‌కి పోటీ చేయాలనే ఉత్సాహంతో ఉన్న వారెవరూ పెద్దగా లేరు. పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉన్న లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఒకరిద్దరు ఆసక్తి చూపుతున్నా, మిగతా స్థానాల్లో మాత్రం మొన్న అసెంబ్లీ ఎన్నికలు చూశాక అమ్మో అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories