ఓవర్ టూ హస్తినా..

ఓవర్ టూ హస్తినా..
x
Highlights

సీఎల్పీ ఎన్నిక క్లైమాక్స్ కు చేరింది. టాస్క్ కంప్లీట్ చేయ‌డానికి హైద‌రాబాద్ వ‌చ్చిన ఏఐసీసీ దూత కేసీ. వేణుగోపాల్ పార్టీ ఎమ్మెల్యేలు, కోర్ క‌మిటీ స‌భ్య‌ల‌తో స‌మావేశ‌మై సీఎల్పీ నేత ఎంపిక కోసం అభిప్రాయాలు సేక‌రించారు. నిర్ణ‌యాధికారాన్ని రాహుల్ గాంధీకి అప్ప‌గిస్తూ నేతలు ఏక‌వాక్య తీర్మాణం చేశారు.

సీఎల్పీ ఎన్నిక క్లైమాక్స్ కు చేరింది. టాస్క్ కంప్లీట్ చేయ‌డానికి హైద‌రాబాద్ వ‌చ్చిన ఏఐసీసీ దూత కేసీ. వేణుగోపాల్ పార్టీ ఎమ్మెల్యేలు, కోర్ క‌మిటీ స‌భ్య‌ల‌తో స‌మావేశ‌మై సీఎల్పీ నేత ఎంపిక కోసం అభిప్రాయాలు సేక‌రించారు. నిర్ణ‌యాధికారాన్ని రాహుల్ గాంధీకి అప్ప‌గిస్తూ నేతలు ఏక‌వాక్య తీర్మాణం చేశారు. సీఎల్పీ నేత ఎంపిక బాల్ ఢిల్లీ హైకమాండ్ కోర్టుకు చేరింది. దీంతో అంద‌రి దృష్టి హ‌స్తిన వైపు మ‌ళ్లింది.

తెలంగాణ రెండో శాస‌న స‌భ కొలువు దీరింది. సీఎల్పీ నేత ఎవ‌ర‌న్నది స‌స్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతోంది.

కాంగ్రెస్ హైక‌మాండ్ సీఎల్పీ నేత ఎంపికపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ఏఐసీసీ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్ ను హైద‌రాబాద్ కు పంపించింది. సీఎల్పీ ఎంపిక టాస్క్ ను కంప్లీట్ చేయ‌డానికి వ‌చ్చిన ఆయ‌న టీపీసీసీ కోర్ క‌మిటీ స‌భ్యుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. వారితో విడివిడిగా స‌మావేశ‌మై అభిప్రాయాలు సేక‌రించారు.

అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ కుంతీయా సమావేశమయ్యారు.అయితే ఎమ్మెల్యేలు త‌మ వ్య‌క్తి గ‌త అభిప్రాయాలు చెబుతూనే నిర్ణ‌యాధికారాన్ని పార్టీ అధినేత రాహుల్ గాంధీకి అప్ప‌గిస్తూ ఏక‌వాక్య తీర్మాణం చేశారు. తీర్మాణాన్ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌వేశ‌పెట్ట‌గా ఎమ్మెల్యేలంతా ఏక‌గ్రీవంగా ఆమోదించారు. సంతకాల‌తో కూడిన తీర్మాణ కాపీని కేసీ వేణుగోపాల్ కు అంద‌జేశారు. అయితే ఏ క్ష‌ణ‌మైన ఢిల్లీ నుంచి నిర్ణ‌యం వెలువ‌డొచ్చ‌ని ఢిల్లీ ప‌రిశీల‌కుడు కేసీ వేణుగోపాల్ తెలిపారు.

నేతల అభిప్రాయ సేకరణలో కొందరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరికొందరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,మల్లు భట్టి పేర్లను సూచించినట్లు సమాచారం. అయితే రాజగోపాల్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యే కావడంతో ఉత్తమ్, భట్టి మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నట్లు అంచనావేస్తున్నారు. సీనియార్టీ ప్రకారం ఉత్తమ్ కు ఛాన్స్ దక్కవచ్చని భావిస్తున్నారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు పరిగణలోకి తీసుకుంటే భ‌ట్టికి చాన్స్ ఉందంటున్నారు. నిర్ణ‌యాధికారం రాహుల్ కు అప్ప‌గించ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఢిల్లీ వైపు మ‌ళ్లింది. ఆచాన్స్ ఎవరికి దక్కుతుందన్నది కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొంది. హస్తిన పెద్ద‌లు తీసుకునే నిర్ణయంతో మ‌రికొద్ది గంట‌ల్లోనే కాంగ్రేస్ శాస‌న స‌భ ప‌క్ష నేత ఎవ‌ర‌నేది తేలిపోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories