Top
logo

70 ఏళ్ల భారతం... చెబుతున్న చేదు నిజం

70 ఏళ్ల భారతం... చెబుతున్న చేదు నిజం
X
Highlights

భారత సువర్ణాధ్యాయంలో మరో మేలిమలుపు.. భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా అవతరించి...

భారత సువర్ణాధ్యాయంలో మరో మేలిమలుపు.. భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా అవతరించి సరిగ్గా అరవై ఏళ్లయింది. ఈ అరవై ఏళ్లలో మన దేశ కీర్తి పతాకం అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడిన సంఘటనలెన్నో.. సాధించిన విజయాలు మరెన్నో.. అధిగమించిన శిఖరాలు ఇంకెన్నో.. అలాగే దాటుకొచ్చిన అగాధాలెన్నెన్నో.. 70 ఏళ్ల గణతంత్ర దినోత్సవ శుభ సమయాన మన రాజ్యాంగ విశిష్టతలూ, ప్రత్యేకతలనొకసారి గుర్తు చేసుకుందాం.. అప్పటికీ ఇప్పటికీ కొన్ని తరాల అంతరం మనకు కనిపిస్తోంది. 60 ఏళ్ల మన ఘనతర గణతంత్రంలో ప్రతీ మలుపూ ప్రత్యేకమైనదే.. మన రాజ్యాంగ వ్యవస్థ మన జీవన ప్రమాణాలపై చూపిన ప్రభావాన్ని ఒకసారి చూద్దాం. మన జనాభా పెరిగింది. సగటు ఆయు:ప్రమాణమూ పెరిగింది. శిశుమరణాల రేటు, నిరక్షరాస్యత తగ్గాయి. అన్ని రంగాలు ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోయాయి. ఈ అరవై ఏళ్లలో మనం సాధించిన విజయాలను.. అధిగమించిన అడ్డంకుల్ని రెప్యుటేషన్ ఇనిస్టిట్యూట్ అనే సంస్థ లెక్కలు కట్టి మరీ ప్రకటించింది.

మన దేశ ఆయు: ప్రమాణం అరవై ఏళ్ల క్రితం 32 ఏళ్లు కాగా, ఇప్పుడది 68 ఏళ్లకు పెరిగింది. అక్షరజ్యోతి కాంతులు ఇప్పుడు భారతదేశమంతటా విస్తరించాయి. 18 శాతం ఉన్న అక్షరాస్యం 68 శాతానికి చేరుకుంది. శిశు మరణాల పురోగతిలోనూ మనం ఎనలేని ప్రగతిని సాధించాం. ప్రతి వెయ్యి జననాల్లో 134 మంది శిశువులు దక్కకుండా పోయే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. అదిప్పుడు గణనీయంగా తగ్గింది. ప్రతీ వెయ్యిమందిలో 53 మంది జీవితాలు మొగ్గలోనే అంతమైపోతున్నాయి. ఇక తలసారి ఆదాయాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోయాయి. 1950 నాటికి తలసరి ఆదాయం 255 రూపాయలు కాగా, అది ఇప్పుడు అంటే అరవై ఏళ్లకి 33,283కి పెరిగింది. అయితే ఈ లెక్కలో ఓ చిక్కుంది. మన దేశంలో అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నందున అందరికీ ఇదే స్థాయిలో ఆదాయాలండవు.. కొందరు కోట్లకు పడగలెత్తితే.. మరికొందరికి రోజు గడవడమే దుర్భరంగా మారిపోతోంది. ఇక బంగారం విషయానికొస్తే అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర 98 రూపాయలుంటే.. ఇప్పుడది 17 వేలకి చేరుకుంది. ఒకప్పుడు కారు అంటే బడాబాబుల ఇళ్లలో ఉండే ఓ విలాసవంతమై వస్తువు. కానీ ఇప్పుడది మధ్య తరగతి వారికీ కనీసావసరంగా మారింది. 1950లో కారు ధర కేవలం 300 రూపాయలుంటే, ఇప్పుడది లక్షా 30 వేలకు పెరిగింది.

భారత రిపబ్లిక్ గా అవతరించాక అందరికీ అనువైన , ఆమెదయోగ్యమైన, రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం.అయితే నూట పదికోట్ల కోట్ల జనాభాకి రాజ్యాంగం రచించడమంటే మాటలా? అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ రూపొందించిన రాజ్యాంగ కర్తల కృషిని స్మరించుకోకుండా వుండలేం..

వాయిస్2: నూట పదికోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవదైన మనదేశం వైశాల్యంలో ప్రపంచంలో ఏడవది. భారత దేశ ప్రాముఖ్యత గత రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. భారత ఆర్థికవ్యవస్థ యొక్క స్థూల జాతీయోతప్పత్తి ప్రకారం నాలుగో స్థానంలో వుంది. ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం అయిన భారత దేశం ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక సామర్ధ్యం కలిగి వున్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది. మన దేశానికి 1947, ఆగస్టు 15న తెల్ల దొరల దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగినప్పటికీ.. మన దేశ దశ.. దిశలను నిర్దేశించుకోవడానికి.. కొన్ని విధి విధానాలు రూపొందించుకోవడానికి.. సమసమాజ నిర్మాణానికి.. సకల జనుల సౌభాగ్యానికి.. మనకి మనమే కొన్ని లక్ష్మణ రేఖలను ఏర్పాటు చేసుకోవడానికి మరో మూడేళ్లు పట్టేసింది. సమానత్వం.. సౌభ్రాతృత్వం భావనలను చాటిచెప్పేలా రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం అంబేద్కర్ చైర్మన్‌గా 1947, ఆగస్టు 29న ఒక కమిటీ ఏర్పాటైంది. మొదట ఈ కమిటీ విస్తృత కసరత్తు జరిపి రాజ్యాంగ ముసాయిదాను రూపొందించింది. దానిని 1947, నవంబర్ 4 అసెంబ్లీకి సమర్పించారు. ఈ కమిటీ రెండేళ్లలో దాదాపుగా 166 రోజులు సమావేశమై దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపింది.వాటికి కొన్ని మార్పులు చేర్పులు చేపట్టింది. అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రూపకల్పనకు రెండేళ్లు పైగా పట్టింది. చివరికి 1950, జనవరి 26న 308 మంది సభ్యులున్న అసెంబ్లీ రాజ్యాంగానికి ఆమోదముద్ర వేసింది. దీంతో ఆ రోజు నుంచి మన దేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. భారత తొలి రాష్ట్రపతిగా బాబూ రాజేంద్రప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.

Next Story