Top
logo

ఎన్నికల వ్యూహాల్లో నినాదాలే కీలకమా..?

ఎన్నికల వ్యూహాల్లో నినాదాలే కీలకమా..?
Highlights

ఎన్నికల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎంత ముఖ్యమో నినాదాలు, ప్రతి నినాదాలు అంతే ముఖ్యం. ప్రతి పొలిటికల్ పార్టీ...

ఎన్నికల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎంత ముఖ్యమో నినాదాలు, ప్రతి నినాదాలు అంతే ముఖ్యం. ప్రతి పొలిటికల్ పార్టీ ఎజెండాతో పాటు పిలుపునిచ్చే నినాదం రాజకీయ బ్రహ్మాస్త్రం అవుతోంది. ఒక్కోసారి పార్టీలు, నేతల భవిష్యత్తును నినాదాలే నిర్ణయిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్నో నినాదాలు నేతల భవిష్యత్తును మార్చేశాయి. కొందరిని అందలం ఎక్కించగా మరికొందరు ఏకంగా రాజకీయాలకు దూరమయ్యారు

ఎన్నికల్లో ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలు నేతలు ఇచ్చే నినాదాలే పదునైన అస్త్రాలుగా మారుతున్నాయి. ఓటర్ల మనస్సును కొల్లగొట్టే వజ్రాయుధంగా మారుతుంది. 1967 ఇందిరా గాంధీ ఇచ్చిన స్లోగన్ రోటీ కపడా ఔర్ మకాన్ ప్రజల్ని ఎంతగా ఆకర్షించిందో ఆ తర్వాత బీజేపి అధికారంలోకి వచ్చేందుకు 'సబ్‌కో దేఖో బారీ బారీ... అబ్‌కీ బారీ అటల్‌ బిహారీ'అంటూ బీజేపీ ఇచ్చిన నినాదం ప్రజల అనుగ్రహం సంపాదించింది.

తమిళనాడులో 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ తొ పొత్తు పెట్టుకున్న రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి నెహ్రవిన్ మగలే విరుగ నియన ఆచీ తురగ నినాదంతో ప్రజల్లోకి వెళ్లి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు.

తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రతి ప్రచార సభలు, సమావేశాల్లో నీంగల్‌ సెవెర్గలా అంటూ ప్రజలను ఓటు వేయాలంటూ అభ్యర్ధిస్తూ స్వర్గీయ ఎంజీఆర్ ను అనుసరిస్తూ ఆయన ఊత పదాన్ని జనాల్లోకి తీసుకువెళ్లారు. అధికారం చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీరామారావు పల్లెపల్లెకు వెళ్లి ప్రచారం చేశారు. తెలుగు ప్రజల మనస్సు దోచుకున్నారు.1983 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

పశ్చిమబెంగాల్లో సుధీరంగా అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ఓడిచండమే లక్ష్యంగా 2011 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన మమత బెనర్జీ

మా, మాటీ, మానుష్ అంటూ రైతుల మనస్సు దోచుకుంది. పశ్చిమబెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించింది. ఉత్తరప్రదేశ్ లోనూ బాబ్రీ మసీదు కూల్చివేతన అనంతరం సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ 1993 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరునాడిని పసిగట్టి బీఎస్పీతో జతకట్టారు. 'మిలే ములాయం-కాన్షీరామ్‌ హవా హోగయే జై శ్రీరామ్‌' (ములాయం కాన్షీరామ్‌ ఒకటైతే జై శ్రీరామ్‌ అదృశ్యం) నినాదంతో అధికారం చేజిక్కించుకున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ నిరుద్యోగ సమస్యనే ప్రదాన ఎజెండగా ప్రజల ముందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాబు కావాలంటే బాబు రావాలి అంటూ జనాల్లోకి వెళ్లారు. 2014లో అధికారంలోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్తు నా భాద్యత అంటు మరోసారి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు చంద్రబాబు. ఎన్నికలకు ముందే రాష్ర్టంలో ప్రజా సంకల్పయాత్ర పేరుతో ప్రచారం మొదలు పెట్టిన వైసీపీ అధినేత జగన్ మీకు నేనున్నాను అన్న నినాదంతో ప్రజలకు భరోసా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.

పాతిక కేజీల బియ్యం తాత్కాలిక సంక్షేమం కాదు సుస్థిర భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామంటూ పాతిక కేజీల బియ్యం కాదు. పాతికేళ్ల భవిష్యత్తు' అనే నినాదంతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారాస్ర్తాలు ప్రయోగిస్తున్నారు. ఇక కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి సారు..కారు పదహారు ఢిల్లీలో సర్కార్ నినాదంతో ప్రచార సభలకు శ్రీకారం చుట్టారు. బీజేపీ చౌకీదార్ పల్లవి పాడుతుంటే చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ ప్రతినినాదం సంధిస్తుంది ఈఎన్నికల్లో ఎవరి నినాదాలకు ప్రజలు ఆకర్శితులవుతారో ఎవరికి పట్టం గడుతారో మరికొద్దిరోజులు వేయిట్ చేయాల్సిందే.

Next Story