Youth Showing Interest on Farming: పట్నం బాట వదిలి సాగు బాట పట్టిన యువకులు

Youth Showing Interest on Farming: పట్నం బాట వదిలి సాగు బాట పట్టిన యువకులు
x
Highlights

Youth Showing Interest on Farming: పల్లెలు దేశాలుకు పట్టుగొమ్మలు దేశ అర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయానికి నిలయాలు అయితే కరోనా ధాటికి...

Youth Showing Interest on Farming: పల్లెలు దేశాలుకు పట్టుగొమ్మలు దేశ అర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయానికి నిలయాలు అయితే కరోనా ధాటికి ఆదరిస్తుందనుకున్న పట్నం తానేమీ చేయలేనంటూ చేతులెత్తేస్తే తల్లి వంటి పల్లెనే ఇప్పుడు అక్కున చేర్చుకుంటుంది. గ్రామీణ యువత ఇప్పుడు నాగలి పట్టి దుక్కి దున్నుతోంది మహామహానగరాలే అల్లాడిపోతుంటే గ్రామీణ ప్రాంతాలు మాత్రం సుభిక్షంగా వ్యవసాయ పనులతో కళకళలాడుతున్నాయి.

కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయి ముఖ్యంగా మహానగరాల్లో పని చేసుకునే వారి పరిస్దితి ఉన్నట్టుండి దిగజారిపోయింది నిన్న మొన్నటి వరకు టైం తో పరిగెడుతు లక్షలు కూడబెట్టాలన్న కోరికలతో పనిచేసిన వారి ఆశలు కరోణ ఒక్కసారిగా కూల్చేసింది ఏం జరగుతుందో తెలుసుకునే లోపే ఆర్దిక కష్టాలను తెచ్చిపెట్టింది కరోనా. అయితే ఉద్యోగాలను నమ్మకున్న పట్టణ ప్రాంత వాసుల పరిస్దితి ఇలా ఉంటే పల్లెల్లో మాత్రం ఆర్దిక ప్రగతిని కరోనా ఏమి చేయలేకపోయింది. కరోనా ప్రపంచమంతా విలయ తాండవం చేస్తున్నా పల్లేప్రాంతాల్లో ఆర్దిక ఇబ్బందులు తేలేకపోయింది పట్ణణాల్లో ఉద్యోగాలు పోయి పనిలేక అల్లాడుతున్న పరిస్దితి ఉంటే గ్రామాల్లో మాత్రం వ్యవసాయంతో చేతినిండా పనితో బిజిబిజిగా ఉన్నారు రైతులు. ఇటీవల పండించిన పంట దిగుబడి కూడా అనుకున్నట్టుగా రావడంతో ఆనందంలో ఉన్నారు రైతులు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున పంట సాగు జరుతుంది. గత సీజన్ తో పోలిస్తే ఈ వానకాలం పంటలకు మరింతగా సాగు విస్తీర్నణం పెరిగే అవకాశాలు ఉన్నాయి పోయిన సీజన్ లో రికార్డు స్దాయిలో పంట దిగుబడి వచ్చింది. దీంతో ఈ వానకాలం పంటల విషయంలో కూడా రైతులు ఉత్సహాంగా నాట్లు వేస్తున్నారు. వరి దాన్యంతో పాటుగా ఈ వానకాలం సీజన్ లో ఉండే పత్తి పంట సైతం ఇప్పటికే రైతులు పెట్టేశారు. చాలా చోట్ల వరి నాట్లు ఇంకా కొనసాగుతున్నాయి సకాలంలో వర్షాలు కురవడం నీళ్లు సమ్రుద్దిగా అందటంతో రైతులు ఆనందంగా వ్యవసాయం పై ద్రుష్టి పెట్టారు.

జిల్లాలో సాగు విస్తీర్ణం గత సీజన్ కంటే ఇప్పుడు కాస్త పెరిగిందనే చెప్పాలి కరీంనగర్ జిల్లా జూన్ లో సాదారణ వర్షపాతం 12.5 సెంటిమీటర్లు కాగా..19 సెంటిమీటర్లు నమోదు అయ్యింది. జులైలో ఇప్పటి వరకు 11 సెంటి మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 13 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఇలా అనకున్నదానికంటే ముందుగానే మంచి వర్షాలు ఉండటంతో పాటుగా,భూగర్భ జలాలు పెరగడం కూడా రైతులకు అనుకూలంగా మారిపోయింది. దీంతో జిల్లాలో అన్ని రకాల పంటల సాగు రెట్టింపనేలా పెరిగింది. కరీంనగర్ జిల్లాలోని 15 మండలాల్లో ఈ రబీలో సాగు విస్తీర్ణం 56,365 ఎకరాలు కాగా అన్ని పంటలు కలిపి 1,01,889 ఎకరాల్లో సాగయ్యాయి ఇంకా అక్కడక్కడా ఈ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఇందులో అత్యధికంగా వరి పంటను 88,453 ఎకరాల్లో సాగు చేశారు రైతులు.

ఒవైపు సమ్రుద్దిగా నీళ్లు మరోవైపు పెట్టు బడి సహాయం ఇలా వ్యవసాయానికి అనుకులమైన వాతావరణం ఉండటంతో ఇప్పుడు రైతులు వానకాలం పంట వేస్తు గ్రామీణ ప్రాంతాల్లో బిజిబిజిగా కనపడుతున్నారు. మరోవైపు పట్ణణ ప్రాతాలకు వలస వెళ్లిన వాళ్లు కూడా ఇప్పుడు స్వగ్రామాలకు రావడం వ్యవసాయం చేపడుతుండటంతో ఆర్దిక పరిపుష్టివైపు గ్రామాలు అడుగులు వేస్తున్నాయి. ఈ పరిస్తితుల్లో గ్రామాల్లో కొత్త వాహానాల కొనుగోళ్లు కూడా ఎక్కువగా అయ్యాయి. ఇటీవల జరగుతున్న వాహానాల రిజిస్ట్రేషన్లు వాహానాల కోసం వస్తున్న డిమాండ్ పెరిగిపోయింది.

గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు సుభిక్షంగా ఉండటంతో తాము నమ్ముకున్న వ్యవసాయంపై మరింతగా దృష్టి పెట్టారు రైతులు. ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో పంటలకు సరిపడా నీళ్లు అన్ని ఉండటంతో ఇప్పుడు ట్రాక్టర్లు, వ్యవసాయ ఆధారిత వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పనుల్లేక అల్లాడుతున్న సమయంలో పల్లెల్లో మాత్రం చేతినిండా పనులతో ఉంటున్నారు అన్నదాతలు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయానికి అవసరమైయ్యే ట్రాక్టర్లకు డిమాండ్ భారీగా పెరిగింది యాసంగి పంట అమ్మాకాల్లో వచ్చిన డబ్బులతో చాలా మంది రైతులు అప్పులు తీర్చేసారు. మరోవైపు వ్యవసాయ కూలీల పెట్టుబడి కంటే డబ్బులున్నప్పడే ట్రాక్టర్లు కొనుగోళు చేయాలన్న అలోచనలతో కొత్త ట్రాక్టర్ల కొనుగోల్లు ప్రారంభించారు చాలా మంది రైతులు. దీంతో ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. లాక్ డౌన్..కరోణ ఎఫెక్ట్ తో డిమాండ్ తగ్గుతుంది అనుకున్న ట్రాక్టర్ కంపెనీలకు షాక్ తగిలినట్టైయ్యింది. గ్రామాల నుండి ట్రాక్టర్ ల కోసం రైతులు అదికంగా వస్తున్నారు దీంతో డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు ట్రాక్టర్ల కంపెనీలు కొత్తవాటిని త్వరగా సప్లై చేయలేకపోవడంతో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ల కి కూడా పెద్ద ఎత్తున్ డిమాండ్ పెరిగిపోయింది. అయితే మల్లీ కొత్త ట్రాక్టర్ కొనేందుకు ఇఫ్పుడు కంపనీలు సప్లై ఇవ్వలేకపోవడంతో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కూడా అమ్మే పరిస్దితి లేకుండా పోయింది. దీంతో కంపెనీల రైతులు కొత్త ట్రాక్టర్ల కోసం ఆర్డర్లు పెడుతున్నారు. అయితే చాలా కంపెనీలకు మహారాష్ట్ర లో ప్రోడక్షన్ యూనిట్ లు ఉండటం అక్కడ కరోణ తీవ్రత ఎక్కువగా ఉండటంతో డిమాండ్ మేరకు సప్లై ఇవ్వలేకపోతున్నారు.

ఒక్క ట్రాక్టర్లే కాదు వ్యవసాయానికి ఉపయోగించే రకరకాల వస్తువులకు ట్రాక్టర్ల విడిబాగాలకు డిమాండ్ ఇప్పుడు పెరిగింది. అటు గ్రామాల్లో ఉంటున్న యువత కూడా ఇప్పుడు కొత్త వాహానాలు కొనుగోలు చేస్తున్నారు. పట్టనాల్లో ఉద్యోగం చేసినా సొంతగా బతకేందుకే ఇబ్బంది పడిన యువత కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ సొంత కాళ్లపై నిలబడుతున్నారు. కరోణ..లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు కొనుగొళ్లును ఆపేసారు. ఆర్దికంగా ఇబ్బందులు ఎదురవ్వడంతో పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్లంతా డబ్బులు ఖర్చుపెట్టే పరిస్దితి లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ దీనావస్ద లేకపోవడం రైతులకు సకాలంలో వర్షాలు నీల్లు పెట్టబడి అందుబాటులోకి ఉండటంతో ఇప్పుడు రైతులు రాజుగా మారే రోజులు వచ్చాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

కరోనా... ఎందరి జీవితాలోనో తలకిందులు చేసింది. ఒక స్థాయి ఆర్థిక గమనాన్ని అనూహ్యంగా మలుపు తిప్పింది. కాలంతో పరుగులు పెట్టే ప్రజల ఆశలను ఒక్కసారి కూలదోసింది. పాతాళానికి పడేసింది. పల్లెల్లో ఉంటే చిన్నతనమని, ఉపాధి దొరకదని భావించిన ప్రజలు ఒకప్పుడు పట్నం బాట పడితే అదే పట్నం ఇప్పుడు తాను ఆదరించలేనంటూ చేతులెత్తస్తోంది. అందుకే యువత మళ్లీ తిరుగు పయనం అవుతోంది. పల్లెల్లో ఉపాధి కోసం పరుగులు తీస్తోంది.

నిన్న మొన్నటి వరకు మహా నగరాలకు పరుగులు పెట్టిన యువకులు ఇప్పుడు గ్రామాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. టైంతో పోటీ పడి ఏన్నో టెన్షన్ల మద్య ఉద్యోగం చేసినా ఆయా కంపనీలు కష్టకాలం లో వారిని ఆదుకోలేకపోయాయి కానీ వారి సొంత గ్రామాలు మాత్రం వ్యవసాయంతోనో లేక కూలీ పనితోను కాసన్న డబ్బుల్నీ సంపాదించుకునేలా చేసింది. దీంతో చాలా మంది యువకులు వ్యవసాయం పై ద్రుష్టిపెడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరిగి సొంత గ్రామాలకు వచ్చిన చాలా మంది యువకులు ఇప్పుడు స్దలం ఉంటే వ్యవసాయం లేదంటే కౌలు వ్యవసాయం చేసేందకు సిద్దమైయ్యారు.

లాక్ డౌన్ వల్ల ఎంతో మంది జీవితాలు కష్టాల్లోకి వెల్లిపోయాయి కార్పొరేట్ కంపెనీలు వ్యాపార సంస్థలు ఎన్నో తమ ఉద్యోగులను తొలగించాయి మరికొన్నిట్లో ప్రొడక్షన్ లేకపోవడం, పనులు జరగకపోవడం తో జీతాలు ఇవ్వలేమంటూ చెప్పేసేయ్. దీంతో అందులో పని చేసే గ్రాడ్యువేట్ లు.,పోస్ట్ గ్రాడ్యువేట్ లు చాలా మంది ఇప్పుడు సొంత గ్రామాలకు వచ్చేశారు. తమ తల్లిదండ్రులతో పాటుగా వ్యవసాయ పనుల్లో చరుగ్గా పాల్గోంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ఇలాంటి వాళ్ళు వందల మంది ఇన్ షర్ట్ ..,టై కట్టుకుని పట్టనాల్లో పనిచేసిన యువత ఇప్పుడు సగర్వంగా తమ సొంత గ్రామాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. యువరైతులంతా కరోణ పుణ్యమా అని సొంత గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం పై ద్రుష్టిపెట్టారు. అంతే కాదు వ్యవసాయం అంటే నష్టాలే అనే భావన నుండి ఇప్పుడు ప్రపంచం దుర్బర పరిస్దితుల్లో ఉన్న సయమంలోను గ్రామాలు ఆర్దిక బాగుండేదుకు కారణం వ్యవసాయమే అనే పరిస్దితికి వచ్చింది. నిజానికి గ్రామాలే పట్టణ ప్రాంతాలకు పట్టుకొమ్మలు ఏనాటికైనా గ్రామీణ వ్యవస్ద వర్దిల్లుతునే ఉంటుంది అనే నానుడికి ఇప్పటి పరిస్దుతులే చక్కటి ఉదాహారణ.

ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా సొంత గ్రామంలో ఏదో ఒక వ్యవసాయ పనులు చేస్తూ లాక్‌డౌన్‌లోనూ నాలుగు డబ్బులు సంపాదించారు. మరోవైపు కొంతమంది గ్రామాల్లో భూమిని కౌలుకు తీసుకునైనా సరే వ్యవసాయాన్ని ప్రారంభించారు. అయితే పట్నంలో చేస్తున్న పనికంటే ఇక్కడ చేసే సాగు పనే గర్వంగా ఉందంటున్నారు చాలా మంది యువకులు. ఇక కరోణ పరిస్తితుల కారణంగా చాలా మంది ఉద్యోగులు..విద్యార్దులు...సొంత ప్రాంతాలకు వచ్చేశారు...వారివారి వ్యవసాయ భుముల్లో స్వయంగా వ్యవసాయం చేసేందుకు ముందుకొచ్చారు....ఇప్పుడు ఉద్యోగాలు కూడా లేకపోవడంతో సొంత గ్రామాల్లోనే వ్యవసాయం చేస్తు నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇక గ్రామాల్లో భూములు ఉండి కౌలుకి ఇచ్చిన వాల్లు కూడా ఇప్పుడు వచ్చి వాళ్లే స్వయంగా వ్వవసాయం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం అద్బతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా వ్యవసాయం కష్టమంటు ఉద్యగాల కోసం మహానగారలకు వెళ్లిన యవకులు ఇప్పుడు తిరిగి దుక్కిదున్నేందుకు వెనక్కి వచ్చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు పెట్టబడి సహాయం కింద రైతు బందు అందింది. కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల అందకపోయినా మెజార్టీ రైతులకు వానాకాలం పంటకు ముందే రైతు బందు డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయి...ఇక భూగర్భ జలాలు కూడా అన్ని చోట్ల వేగంగా పెరిగాయి. గతంలో మెట్ట ప్రాంతంగా ఉన్న సిరిసిల్ల జిల్లా లాంటి ప్రాంతాలకు నీళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కరీంనగర్ జిల్లా రామడుగు లాంటి ప్రాంతాల్లో బొర్లు వేయోద్దంటు నిశేషదం విదించిన సందర్బాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అదే ప్రాంతాంలో సాగు నీటిని అందుబాటలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.

ఇలా రకరకాల కారణాల వల్ల ఇప్పుడు గ్రామాల్లో సాగు కల ఉట్టిపడుతుంది. గ్రామీణ జీవనం ఏనాటికైనా ఏ పరిస్దితినైనా ఎదర్కుంటుంది అనేదానికి ఇప్పుడున్న పరిస్దుతులే నిజమైన నిదర్శనంగా మనం చెప్పుకొవచ్చు. వ్యవసాయం చేసకుంటునే కరోణ వైరస్ తమతమ గ్రామాలకురాకుండా చేసుకునేందుకు గ్రామస్దులు అనేక జగ్రాత్తలు కూడా తీసుకుంటున్నారు. గ్రామంలో ఎవరికివారు లాక్ డౌన్ విదించుకోవడం భౌతిక దూరం పాంటించడం లాంటివి తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కరోణ భయం చాలా తక్కువగా ఉంది. లాక్‌డౌన్‌లో ప్రపంచ దేశాలన్నీ అల్లకల్లోలంగా మారిపోయాయి. ఆధునిక వైద్య సదుపాయాలున్న అగ్రరాజ్యాలు కూడా తట్టులోకపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ పల్లెలు సుభిక్షంగా వర్ధిల్లుతున్నాయి. గ్రామాల్లో భూమిని నమ్ముకున్న రైతులు ఇంతటీ సంక్షోభంలోనూ హాయిగా ివ్యవసాయాన్ని చేసుకుంటున్నారు.

చూశారు కదా శ్రమైక జీవన సౌందర్యం ఉట్టి పడే పల్లెల్లో ఇప్పుడు ఆర్థిక పురోగతి కొత్త పుంతలు తొక్కుతోంది. రైతుల నుంచి కొనుగోళ్లు జరుగుతున్న వాహనాలు విడి భాగాల వల్ల వ్వవసాయ పనిముట్ల వ్యాపారులు కూడా సంతోషంగా కాలం వెళ్లదీస్తున్నారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ కచ్చితంగా పుంజుకునే అవకాశాలే ఎక్కువున్నాయి. అందుకే గ్రామాలు ఎప్పుడు పచ్చగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహిద్దాం.


Show Full Article
Print Article
Next Story
More Stories