కౌజు పిట్టల పెంపకంలో రాణిస్తున్న జక్క పెద్దన్న

కౌజు పిట్టల పెంపకంలో రాణిస్తున్న జక్క పెద్దన్న
x
Highlights

కోడిపిల్ల మాంసం కంటే కౌజు పిట్ట మాంసం రుచిగా ఉంటుంది. పిల్లల్లో ఈ మాంసం శరీరం, మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది. పోషకపరంగా చూస్తే కౌజు గుడ్లు...

కోడిపిల్ల మాంసం కంటే కౌజు పిట్ట మాంసం రుచిగా ఉంటుంది. పిల్లల్లో ఈ మాంసం శరీరం, మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది. పోషకపరంగా చూస్తే కౌజు గుడ్లు కోడిగుడ్లతో సమానంగా బలవర్ధకమైనవి. అంతేకాకుండా కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు, కౌజు పిట్ట మాంసం, గుడ్లు ఒక పౌష్టికాహారం. ప్రస్తుతం ఈ కౌజు పిట్టలకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌నే గుర్తించి ఉన్న ఉద్యోగాన్ని సైతం వదులుకుని వీటి పెంపకంపైపు కదిలాడు ఓ యువరైతు. కౌజు పిట్టల పెంపకంలో రాణిస్తున్న మేడ్చల్ జిల్లా రైతు జక్క పెద్దన్నపై ప్రత్యేక కథనం.

మేడ్చల్ జిల్లా గౌరం పేట గ్రామానికి చెందిన యువరైతు జక్క పెద్దన్న. గతంలో రెడ్డీస్‌ ల్యాబ్‌లో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేసిన పెద్దన్న కౌజు పిట్టల పెంపక గురించి తెలుసుకున్నాడు. ఉద్యోగం చేస్తూనే ఇంటి మేడ మీద కౌజుల పెంపకాన్ని మొదలు పెట్టాడు. ఆ క్రమంలో పెంపకంలో మొదట్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు అయినా వెనుకడుగు వేయలేదు. కౌజుల గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు. ఉన్య ఉద్యోగాన్ని సైతం వదులుకుని కొత్త కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతూ ప్రస్తుతం కౌజు పిట్టల ఫామ్‌ను నిర్వహిస్తున్నాడు. మంచి ఫలితాలను సాధిస్తున్నాడు.

బ్రాయిలర్ కోళ్లు మంచిది కాదు అన్న భావనతో తెలుగురాష్ట్రాల్లో నాటు కోళ్ల పెంపరం జోరందుకుంది కానీ నాటు కోళ్ల కన్నా కౌజుపిట్టల్లో పోషకాలు ఎన్నో ఉన్నాయంటున్నాడు ఈ రైతు. అందుకే ఒకరోజు పిల్ల దగ్గరి నుంచి గుడ్ల వరకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని చెబుతున్నాడు. ప్రధానంగా ఏపీ తెలంగాణలో హేచరీలు తక్కువగా ఉన్నాయని. అందుకే తమకు అధిక డిమాండ్ ఉందంటున్నాడు.

ఇప్పటి వరకు కౌజు పిట్టలు పెంపకం చేసే వారి సంఖ్య బాగానే వుంది. కానీ హ్యచరీలల సంఖ్య చాల తక్కువ. అందుకే తన ఫార్మ్‌లో లక్షా 20 వేల కెపాసిటీ కలిగి హ్యాచరీని మూడేళ్ల కిందట ఏర్పటు చేసుకున్నాడు. దీని ద్వారా నెలకు లక్షా 20 వేల గుడ్లను పొదిగించవచ్చు. 4 నుంచి 5 రోజులకు ఒకసారి గుడ్లను లోడ్ చేస్తుంటారు. కోడికి వెచ్చదనం, తేమశాతం కరెక్ట్‌గా ఉంటేనే 13 రోజుల్లో గుడ్డులో బేబీ తయారవుతుందంటున్నారు పెద్దన్న. కౌజు పిట్టల పెంపకాన్ని మొదలు పెట్టాలనుకునే వారికి సలహాలు సూచనలు అందిస్తున్నాడు ఈ యువరైతు. ప్రతీ ఒక్కరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తాము ముందుకు వెళ్తున్నామంటున్న పెద్దన్న నేటియువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories