Top
logo

లాభాల బాటలో పయనిస్తున్న దేవిక

లాభాల బాటలో పయనిస్తున్న దేవిక
X
Highlights

వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుంది ఓ మహిళా రైతు. మొదట్లో ఫ్యా‎షన్ డిజైనర్ గా...

వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుంది ఓ మహిళా రైతు. మొదట్లో ఫ్యా‎షన్ డిజైనర్ గా రాణించింది తరువాత క్రమంలో తన బిడ్డలకు స్థిరమైన ఆదాయ రంగాన్ని ఆస్తిగా ఇవ్వాలనుకుంది హైదరాబాద్ నాచారం కి చెందిన దేవిక. అదే క్రమంలో సేంద్రియ విధానంలో బాతులు, కంజు పిట్టల పెంపకం ద్వారా లాభాలను ఆర్జిస్తుంది. పూర్తి అవగాహనతో పక్కా ప్రణాళికతో లాభాలు ఘడిస్తున్నారు రైతు దేవిక.

నాచారంకు చెందిన దేవిక, మొదట్లో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణించింది, తన బిడ్డలకు స్థిరమైన ఆదాయ రంగాన్ని ఆస్తిగా ఇవ్వాలనుకున్న ఆమె, ఏ రంగమైనా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించాలనుకుంది ఆ క్రమంలోనే కొద్ది పాటి పెట్టుబడులు ఉండి త్వరగా చేతికోచ్చే కౌజు పిట్టలు, బాతుల పెంపకాన్ని ప్రారంభించింది.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో తక్కువ పెట్టుబడి తో చిన్నసన్నకారు రైతులకు మంచి ఉపాధి మార్గంగా ఉంటున్నాయి కౌంజుల పెంపకం. అయితే ఈ కౌజు పెంపకంలో మెళకువలను పాటిస్తూ కొన్నేళ్లుగా లాభాదాయకమైన ఆదాయాన్ని అందుకుంటున్నారు దేవిక. ఈ క్రమంలో కౌజు పిట్టల ముఖ్యంగా బ్రూడింగ్ చేసే సమయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలంటున్నారు.

కౌజు పిట్టల కోసం తక్కువ ఖర్చుతో అనువైన షెడ్డును, కేజ్ లను నిర్మించుకున్నారు దేవిక. దాణా, నీరు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అంతేకాకుండా గుడ్లను ఎప్పటికప్పుడు పరి రక్షించుకోవాలని సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలను పొందవచ్చని అంటున్నారు నిర్వాహకురాలు దేవిక.

కౌజు పిట్టలే కాకుండా వీరి షెడ్డులో ప్రత్యేకంగా బాతుల పెంపకం చేపడుతున్నారు. తక్కువ ఖర్చులో తొందరగా చేతికోచ్చే వైట్ పికెన్ జాతికి చెందిన రకాలను వీరు పెంచుతున్నారు. అయితే పెంపకానికి అనువైన షెడ్డుతో పాటు షెడ్డు నిర్వాహణలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మంచి దిగుబడి కోసం బాతు పిల్లలను బ్రూడింగ్ చేసే సమయంలో కొన్ని మొళకువలు పాటించాలంటున్నారు.


Web Titlewomen farmer Quail Birds Farming Success Story
Next Story