ప్రకృతి విధానంలో తైవాన్ జామ సాగు

ప్రకృతి విధానంలో తైవాన్ జామ సాగు
x
Highlights

పళ్లలో పేదవాడి ఆపిల్ గా జామపండుకు ఒక విశిష్టత ఉంది. అధిక పోషకాలు కలిగిన జామపండ్లు తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. దేశి జాతుల రకాలతో పాటు ఎన్నో...

పళ్లలో పేదవాడి ఆపిల్ గా జామపండుకు ఒక విశిష్టత ఉంది. అధిక పోషకాలు కలిగిన జామపండ్లు తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. దేశి జాతుల రకాలతో పాటు ఎన్నో వెరైటీలు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి. అందులో పోషక విలువలు అధికంగా ఉండే తైవాన్ జామకు డిమాండ్ మరింత ఎక్కువ సేద్యం పరంగా చూసుకున్నా జామ సాగు రైతులకు లాభసాటిగా ఉంటుంది. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు కలిగే ఈ సాగువైపు చాలా మంది రైతులు ఆసక్తి చూపెడుతున్నారు. వాణిజ్య పంటలను వేసి నష్టాలను చవి చూసిన వారికి ఈ జామ సాగు ఒక మంచి మార్గం అవుతుందని చెప్పవచ్చు. ఆ విధంగానే 15 సంవత్సరాలుగా రసాయన వ్యవసాయం చేస్తూ వాణిజ్య పంటలైన పత్తిని సాగు చేసి నష్టాలను ఎదుర్కొని, గత రెండేళ్లుగా ప్రకృతి విధానంలో తైవాన్ జామను సాగు చేస్తున్న వికారాబాద్ జిల్లా, రోంపల్లి గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు రాజు పై ప్రత్యేక కథనం

వికారాబాద్ జిల్లా కి చెందిన రాజు గత 15 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు, ముందు రసాయన పద్దతిలో పత్తి వంటి వాణిజ్య పంటలను సాగు చేసి నష్టాలను చవి చూసిన ఈ రైతు, పొన్నుస్వామి పద్దతిలో అరటి పంటను సాగు చేసాడు, అది కూడా అంతంత మాత్రాన ఉండడంతో సన్నిహితులు, నిపుణుల సలహాతో పూర్తిస్థాయి ప్రకృతి విధానంలో తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు తెచ్చే తైవాన్ జామ సాగు మొదలు పెట్టాడు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ జామ సాగు విధానం గురించి రైతు మాటల్లోనే తెల్సుకుందాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories