ఉపాధి మార్గంగా పందెం కోళ్ల పెంపకం

Venkat Raju
x
Venkat Raju
Highlights

గత కొంతకాలంగా ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విపత్కర పరిస్థితుల మధ్య క్షణ క్షణం భయంతో గడిపిన రైతన్న చల్లగా, చల్లని గాలుల మధ్య, ప్రశాంతంగా సేద తీరుతున్నాడు....

గత కొంతకాలంగా ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విపత్కర పరిస్థితుల మధ్య క్షణ క్షణం భయంతో గడిపిన రైతన్న చల్లగా, చల్లని గాలుల మధ్య, ప్రశాంతంగా సేద తీరుతున్నాడు. తాను కష్టపడి, చెమటోడ్చి పండించిన పంట ఇంటికి చేరడంతో సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాడు. పల్లెలన్నీ రైతుల సందడితో కళకళలాడుతున్నాయి. మరి ఈ పండుగ పూట రైతుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందకు పందెంకోళ్ళ పెంపకంపై స్పెషల్ ఫోకస్‌తో సిద్ధమైంది మీ నేలతల్లి కార్యక్రమం...పశ్చిమ గోదావరి జిల్లా పోదూరు సమీపంలోని కొమ్ము చిక్కాల గ్రామంలో కుటీర పరిశ్రమగా పందెంకోళ్ళ పెంపకాన్ని చేపడుతూ ఎంతో మందికి ఉపాధిని కల్పించడంతో పాటు స్వయంగా లాభాలను ఆర్జిస్తున్న రైతు వెంకట రాజు విజయగాథను తెలుసుకుందాం.

పందెం కోళ్ల పెంపకం అంటే ఏదో ఆహారం పెట్టేస్తే సరిపోతుందనుకుంటే పొరపాటు. వీటికి మంచి బలవర్థకమైన ఆహారం ఇస్తున్నారు వెంకటరాజు. ప్రతీ రోజు వీటి మెనూలో జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. రోజూ కోడిగుడ్డు కూడా ఇస్తారు. అంతేకాదు కొన్నింటికి మటన్‌ను ఆహారంగా తప్పక ఉండాల్సిందే కోడి బలంగా తయారయ్యేందుకు ఈ ఆహారం ఎంతగానో దోహదపడుతుందంటున్నారు రైతు వెంకటరాజు. సీజన్‌ను బట్టి పందెం కోళ్ళు గుడ్లు పెట్టేందుకు ప్రత్యేక విధానాలను అనుసరిస్తున్నారు ఈ రైతు చిన్న పిల్ల వయస్సు నుంచే వాటికి పోషకాహారాన్ని అందిస్తూ పందెం కోళ‌్ళుగా తయారు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories