నిజామాబాద్ జిల్లాలో పచ్చ బంగారం ఇక కనుమరుగు కానుందా..?

నిజామాబాద్ జిల్లాలో పచ్చ బంగారం ఇక కనుమరుగు కానుందా..?
x
Highlights

Turmeric Cultivation Farmers Problems in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పచ్చ బంగారం ఇక కనుమరుగు కానుందా..? పసుపు సాగుకు రైతన్నలు గుడ్ బై...

Turmeric Cultivation Farmers Problems in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పచ్చ బంగారం ఇక కనుమరుగు కానుందా..? పసుపు సాగుకు రైతన్నలు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారా...? మద్దతు ధర కోసం రోడ్డెక్కి ఉద్యమాలు చేసి.. గత పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బ్యాలెట్ పోరు చేసిన పసుపు రైతులు ఇప్పుడు ఇతర పంటల వైపు ఎందుకు మళ్లుతున్నారా..? ప‌సుపు సాగుకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే నిజామాబాద్ లో స‌గానికి పైగా పసుపు సాగు తగ్గడానికి కారణాలు ఏమిటో చూడండి.

పసుసు సాగుకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నిజామాబాద్ జిల్లాలో క్రమక్రమంగా పసుపు సాగుకు తగ్గిస్తూ ప్రత్యామ్నయ పంటల వైపు రైతులు దృష్టిపెడుతున్నారు. జిల్లాలో వరి తర్వాత ప్రధాన పంటగా పసుపు సాగు చేస్తారు. ఆసియాలో అత్యధికంగా పసుపు పండే నిజామాబాద్ జిల్లాలో పలు కారణాలతో ఈ సంవత్సరం పసుపు సాగును తగ్గించారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు తగ్గించడానికి ప్రధాన కారణం మద్దతు ధర లేకపోవటం, పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవడం, పెట్టుబడులు పెరగడం లాంటి కారణాలతో రైతులు పసుపు సాగును తగ్గిస్తున్నారు. రాబోయే కాలంలో పసుపు సాగుకు పూర్తిగా పుల్ స్టాప్ పెడతామంటున్నారు.

ఆర్మూర్ డివిజన్ లో పసుపు పెద్ద ఎత్తున సాగు చేస్తారు. సుమారు 65 వేల ఎకరాల్లో పసుపు సాగు చేసే రైతులు ఈ ఏడాది సగానికి పైగా సాగు తగ్గించారు. గిట్టుబాటు ధర రాక గతంలో అనేక సార్లు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన రైతులు గత పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పోరు చేసి దేశం దృష్టిని ఆకర్షించారు. ఐతే మద్దతు ధర మాత్రం సాధించలేకపోవడంపై నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం పసుపు ధర క్వింటాలకు 5 నుంచి 6 వేల వరకు మాత్రమే పలుకుతోంది. రెండేళ్లుగా పసుపు కు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్ లో పసుపు సాగు చేసేందుకు ధైర్యం చేయడంలేదు. పసుపు పండించి నష్టాలు తెచ్చుకునే బదులు ప్రత్యామ్నయ పంటలు వేసి అంతో ఇంతో లాభాలు తెచ్చుకోవడం ఉత్తమం అంటున్నారు.

పసుపు పంటకి మద్దతు ధర ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం మాని, పసుపు రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories