Miyazaki Mango: ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్‌లీ గురూ..!

The Worlds Costliest Mango Miyazaki Mango
x

Miyazaki Mango: ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్‌లీ గురూ..!

Highlights

Miyazaki Mango: ఏటా ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉండే పండు మామిడి పండు. ఈ పండ్ల రుచి మరో పండుకు రాదు.

Miyazaki Mango: ఏటా ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉండే పండు మామిడి పండు. ఈ పండ్ల రుచి మరో పండుకు రాదు. అందుకే దీనిని పండ్ల రాజా అని పిలుస్తుంటారు. మరీ ఈ ఏడు ఎన్నో మామిడి పండ్ల రుచులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి పండు రుచి తప్పక చూసితీరాల్సిందేనని చాలా మంది మామిడి ప్రియులు ఆశగా ఎదురుచూస్తుంటారు. నిజానికి ఈ పండు రుచి ముందు మరో పండు సరిపోదు. రుచిలోనే కాదు పోషకాల్లోనూ మామిడి రాజానే. మానవ శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు మామిడిలో పుష్కలంగా లభిస్తాయని న్యూట్రీషియన్‌లు చెబుతుంటారు. మామిడి పండ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు స్పష్టం చేశాయి. భారతదేశంలో బంగినపల్లి, కలెక్టర్ మామిడి, నీలవేణి, రసాలు, చెరకు రసం, చిన్న రసాలు, పెద్ద రసాలు, సువర్ణ , కొబ్బరి అంటూ చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ అందరూ ఆస్వాదించదగ్గ ధరల్లోనే మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. కానీ ఈ మామిడి ధర మాత్రం ప్రపంచంలోనే అత్యధికం. ఇది భారతదేశానికి చెందిన పండు కాదు. జపాన్‌లోని మియాజాకీ నగరంలో విరివిగా సాగులో ఉన్న మియాజాకి పండు.

ఎగ్ ఆఫ్ సన్‌షైన్‌గా పిలవబడే మియాజీకి పండు జపాన్‌లో మాత్రమే కనిపించే అరుదైన మామిడి పండు. దీని ధర కిలో రెండున్నర లక్షలు పలుకుతోంది. అంతలా ఈ పండు స్పెషాలిటీ ఏమిటి అని ఆలోచిస్తున్నారా అక్కడికే వస్తున్నాం. ఈ మియాజాకి మామిడికి ప్రత్యేకమైన వాసన, రుచి ఉంటాయి. కాయలు 350 గ్రాముల బరువుండి అన్ని వైపులా ఎరుపు రంగులో ఉన్న వాటికే జపాన్‌లో అధిక గిరాకీ ఉంటుంది. ఈ మామిడిలో యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్‌ లు పుష్కలంగా ఉంటాయి. కంటి చూపు సమస్య ఉన్న వారికి ఇవి బాగా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ మామిడి తింటే కేన్సర్ రిస్క్‌ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ మామిడిలో క్యాన్సర్ నిరోధించే గుణాలు ఉన్నాయి. అంతే కాదు జింక్, కాల్షియం, విటమిన్లు సి, ఇ, ఎ, ఖె వంటి పోషకాలు మియాజాకి మామిడిలో పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన కాపర్, మెగ్నీషియాలను ఇది అందిస్తుంది. రాజస్థాన్‌లో గిరిధర్‌పురాకు చెందిన కిషన్ సుమన్ అనే రైతు కూడా మియాజాకీ పండ్ల గురించి అంతర్జాలంలో తెలుసుకుని, జపాన్ నుంచి ఆ మొక్కలను తెప్పించి సాగు చేస్తున్నారు.

జపాన్ ప్రజలకు మామిడి పండ్లంటే మరింత మక్కువట. అక్కడ కొన్ని రకాల మామిడి పండ్లను ఏకంగా వేలం పాట నిర్వహించి మరీ కంటారట. ఇలా లక్షల రూపాయలు వెచ్చించి కొనే మామిడి పండ్లలో మియాజాకీ రకం ముందు వరుసలో ఉంటుంది. ఈ రకం పండ్ల ధర అక్కడ కిలోకు రెండున్నర లక్షల వరకు పలుకుతుందట. కొన్నిసార్లు వేలంలో 3 లక్షల రూపాయల వరకు ధర పెరుగుతుందట. చూశారా ఈ మియాజాకి పండు రుచి చూడాలంటే ఏకంగా రెండు లక్షలన్నర ఖర్చుచేయాలి. మరి రాజస్థాన్‌ రైతు ఈ పండ్ల దిగుబడని సాధిస్తే ఎంతకు అమ్ముతాడో మరి వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories