మహిళలు... మిద్దెతోటలు !

మహిళలు... మిద్దెతోటలు !
x
మహిళలు... మిద్దెతోటలు !
Highlights

మన ఇంటి ఆవరణలో ఒక పూల మొక్కను పెంచుతూ దానికి కాసిన పూలను చూస్తే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఆ విధంగానే స్వయంగా మిద్దెతోటనే సాగు చేసి, అందులో...

మన ఇంటి ఆవరణలో ఒక పూల మొక్కను పెంచుతూ దానికి కాసిన పూలను చూస్తే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఆ విధంగానే స్వయంగా మిద్దెతోటనే సాగు చేసి, అందులో పండించుకున్న పండ్లు, కూరగాయలు తిన్నప్పుడు కూడా కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. పైగా మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలు కూడా రసాయనాలతో విషాహారంగా మారుతున్న క్రమంలో నగరవాసులంతా పెరటి, మిద్దెతోట పెంపకంలో భాగమవుతున్నారు. మరీ ముఖ్యంగా ఇంటి పట్టునే ఉండే గృహిణీలకు, మిద్దెతోటలు సేంద్రియ ఆహార వనరుగానే కాకుండా, మానసిక, శారీరక రుగ్మతలను కూడా తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో, మన ఇంటిపంటల వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే వాటి సాగు తీరుపై ప్రత్యేక కథనం.

రంగారెడ్డి జిల్లా ఘట్కేశ్వర్ గ్రామానికి చెందిన వినోద, గృహిణిగా ఇంటి పట్టునే ఉంటుంది. రసాయనాలతో పండిస్తున్న కూరగాయలు, పండ్ల వల్ల కలిగే సమస్యల గురించి తెల్సుకున్న ఆమె, స్వయంగా తానే ఇంటిపంట సాగును మొదలుపెట్టింది. మిద్దెతోటల వల్ల నాణ్యమైన ఆహారం పండించుకోవడమే కాకుండా మానసిక ఆహ్లాదాన్ని పొందుతున్నాని, ఇలా ప్రతి ఒక్కరు కూడా తమకి ఉన్న కోద్ది స్థలాల్లో అయినా తమ వంతు కూరగాయలు, ఆకు కూరలు సేంద్రియ పద్ధతిలో పెంచుకుంటే ఆరోగ్యం, ఆనందం రెండూ ఉంటాయని అంటుంది.

తాండూరు గ్రామానికి చెందిన లక్షికి చిన్నప్పటి నుండి మొక్కల పెంపకంపై ఆసక్తి ఎక్కువ, వ్యాపకంగా ఉండే పూల మొక్కల పెంపకం, ఆమెను మిద్దెతోటవరకు తీసుకొచ్చింది. రంగు రంగుల పూలతో పాటు కూరగాయలు,పండ్ల, ఆకుకూరలను కూడా తన ఇంటి ఆవరణలో సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నారు లక్ష్మి. స్వయంగా పండించుకున్న ఆహారాన్ని తినడంలో వర్ణించలేనంత సంతోషం ఉందంటుంది.

అపార్టుమెంటులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ బరువుతో అందమైన మిద్దెతోటలును నిర్మించుకుంది కూకట్ పల్లికి చెందిన నీలిమ. చిన్న చిన్న కుండీలలో మొక్కలను పెంచడం ప్రారంభించి, దాదాపు 10 సంవత్సరాలుగా ఇంటిపంటను సాగు చేస్తుంది. అపార్టుమెంటు మేడలపై తక్కువ బరువు పడే విధంగా రైజ్డ్ బెడ్స్ లో మొక్కలను పెంచుతుంది.

మనం నిత్యం తీసుకొనే ఆహారం ఎన్నో రకాల రసాయానాలతో కలుషితమవుతున్నాయి. అందులో నగరాలకు వచ్చే కూరగాయల పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. ఈ రసాయనాల మోతాదును పెద్దలు కొంత వరకు తట్టుకున్నప్పటికి పిల్లలకు అనారోగ్యాలకు గురి చేసే అవకాశం వుంది. అందుకే తన మనవరాలి కోసం ప్రత్యేకంగా మిద్దెతోటను సాగు చేస్తుంది బంజారాహిల్స్ కు చెందిన ప్రభ.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories