Top
logo

ఇంటినే వనంగా మార్చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌

ఇంటినే వనంగా మార్చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌
X
Highlights

మనం ఏం తింటున్నాం తినే ఆహారం ఎంత వరకు ఆరోగ్యకరం అన్న ఆలచన అందరిలో మెళ్లిమెళ్లిగా మొదలవుతోంది. అసలు మనిషి...

మనం ఏం తింటున్నాం తినే ఆహారం ఎంత వరకు ఆరోగ్యకరం అన్న ఆలచన అందరిలో మెళ్లిమెళ్లిగా మొదలవుతోంది. అసలు మనిషి అనారోగ్యానికి అసలైన కారణం ఆహార లోపమే అన్న విషయంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అందుకే మనమే ఎందుకు ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయకూడదని భావించారు హైదరాబాద్‌లోని యాప్రాల్‌కు చెందిన అనిల్. ఇందుకు కుటుంబ సభ్యులంతా చేయి చేయి కలిపారు ఇంటిని ఆరోగ్యకరమైన వనంగా మార్చారు.

అనిల్ వృత్తి రిత్యా ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌. నిత్యం బిజీ బిజీ జీవితం అందులోనూ కాస్త సమయాన్ని కేటాయించి మిద్దె తోటల సాగును చేస్తున్నారు.

మొదట రెండు గులాబీ మొక్కలతో మిద్దె తోట సాగు చేపట్టారు అనిల్ తండ్రి దానిని అలా అభివృద్ధి చేస్తూ నేడు ఓ పచ్చటి వనంలా మార్చేసారు. 120 గజాల స్థలంలో 4 వేలకు పైగా మొక్కలను పెంచుతున్నారు. అదీ పూర్తి ఆర్గానిక్ పద్ధతుల్లో. పంటలను ఆవుపేడ, మేక ఎరువు, కంపోస్ట్‌తో పండిస్తున్నారు. ఆరోగ్యంగా జీవిస్తున్నారు.

గత 10 ఏళ్లుగా మిద్దె తోటలను సాగు చేస్తున్నారు అనిల్. పూలతో ప్రారంభమైన తోటల సాగు ఇప్పుడు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లు వచ్చి చేరాయి. 10 కుండీల నుంచి 4వేల కుండీల్లో మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. అన్ని రకాల పూలు, కూరగాయలు ఇక్కడ కనిపిస్తాయి. అనిల్ కు తన తల్లి రమణమ్మ మిద్దె సాగులో ఎంతో సహకరిస్తున్నారు ఇంటి పట్టునే ఉంటూ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మొక్కలతోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఇదే తమ ప్రపంచం అని అంటున్నారు రమణమ్మ.

మిద్దె తోటల సాగులో తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటలను పండించాలన్నది అనిల్ ఆలోచన అందుకు తగ్గట్టుటగానే కుండీలకు మడులకు పెద్దగా ఖర్చు చేయకుండా పాడైపోయిన ప్లాస్టిక్ ట్యాంకులు, పెయింట్ బకెట్‌లు, కూలర్లు, అలాగే ఫ్లష్ ట్యాంకులలో మొక్కలను పెంచుతున్నారు. డబ్బును ఆదా చేయడంతో పాటు మేడ మీద ఎక్కువ బరువు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మేడ మీద చిన్న స్థలం ఉన్నా చింతలేని జీవితాన్ని గడపవచ్చు. ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసుకోవచ్చు. పది కాలాల పాటు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు.

Next Story