చిన్న పట్టణాలలోనూ పెరుగుతున్న మిద్దెతోటల సంస్కృతి

చిన్న పట్టణాలలోనూ పెరుగుతున్న మిద్దెతోటల సంస్కృతి
x
చిన్న పట్టణాలలోనూ పెరుగుతున్న మిద్దెతోటల సంస్కృతి
Highlights

మహా నగరాల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాలలోను మిద్దెతోటల సంస్కృతి పెరుగుతోంది. ఆరోగ్యాన్ని, మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే ఇంటిపంటల సాగు పై ఎక్కువ శాతం...

మహా నగరాల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాలలోను మిద్దెతోటల సంస్కృతి పెరుగుతోంది. ఆరోగ్యాన్ని, మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే ఇంటిపంటల సాగు పై ఎక్కువ శాతం కుటుంబికులు ఆసక్తి చూపుతున్నారు. రసాయనాలతో పండుతూ మార్కెట్లో మండిపోతున్న కూరగాయల ధరలను చూసి మిద్దెతోటల బాట పడుతున్నారు. తమకు అనువైన చిన్నపాటి ఖాళీ స్థలాలను సైతం మొక్కలతో నింపేస్తూ స్వయంగా సేంద్రియ పద్ధతిలో ఔషధ, పండ్లు, కూరగాయల మొక్కలని సాగు చేస్తున్నారు. ఆ విధంగానే చినప్పటి నుండి గ్రామీణ వాతావరణంలో పెరిగి, పెరటితోట పెంపకాన్ని మరువకుండా నేటికీ ఇంటిపంటను సాగు చేస్తున్న రంగారెడ్డి జిల్లాకి చెందిన శాంకరీశ్వరి మిద్దెతోట పై ప్రత్యేక కథనం.

రంగారెడ్డి జిల్లా, తాండూర్ గ్రామానికి చెందిన శాంకరీశ్వరి, చిన్ననాటి నుండి పెరటి మొక్కల మధ్య గ్రామీణ వాతావరణంలో పెరిగింది. పసి వయసు నుండే పూల మొక్కల పెంపకం అలవాటు ఉన్న ఆమెకు, తన తండ్రి ఇచ్చిన స్పూర్తితో పూర్తి స్థాయి మిద్దెతోటలను సాగు చెయ్యడం మొదలుపెట్టింది. దాదాపు అన్ని రకాల పండ్లు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు శాంకరీశ్వరి.

మార్కెట్ లో దొరికే పండ్లు,కూరగాయలు,ఆకు కూరల సాగులో రసాయనాల వాడకం మితి మీరుతుంది. అదే క్రమంలో పెరుగుతున్న ధరలు కూడా వినియోగదారులను భయపెడుతున్నాయి. వీటికి పరిష్కారంగా తన మిద్దెతోటలో దాదాపు అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకు కూరలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తుంది ఈవిడ. ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి మిద్దెతోటలు ప్రామాణికం అని అంటుంది.

మొక్కల పెంపకానికి సాధారణ కుండీలతో పాటు వృధాగా ఉన్న టబ్బులు, బకెట్లను వాడుతూ తన భర్త నిర్వహించే ఫంక్షన్ హాల్ లో నిరుపయోగంగా ఉన్న డబ్బాలను కూడా ఉపయోగిస్తున్నారు. తమ మిద్దెతోటలో ఉండే చిన్నపాటి స్థలాన్ని కూడా మొక్కలతో నింపేశారు శాంకరీశ్వరి. అంతేకాకుండా అరుదైన ఔషధ మొక్కలు, దుంపలను సాగు చేస్తూ పిచ్చుకలు, తేనెటీగల కోసం ప్రత్యేక మొక్కలను కూడా పెంచుతున్నారు. తమ ఇంటిలోనే కాకుండా, తన భర్త నిర్వహిస్తున్న ఫంక్షన్ హాల్లో సైతం ఇంటి పంటలను సాగు చేస్తున్నారు. ఈ కల్యాణ మండపంలో పెంచుతన్న మొక్కలకు పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో వృధా అయిన కూరగాయల వ్యర్ధాలను ఎరువులుగా వాడుతామని అంటున్నారు నిర్వాహకులు సంగమేశ్వర్.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories