3 అంతస్థుల్లో ముచ్చటైన మిద్దెతోట

3 అంతస్థుల్లో ముచ్చటైన మిద్దెతోట
x
Highlights

ఇంటిపంటలు ఆరోగ్యంతో పాటు, మానసిక సంతోషాన్ని కూడా కలిగిస్తాయి. ప్రస్థుత కాలంలో అధిక దిగుబడి కోసం రసాయనాలు వేసి పండించే కూరగాయలు రోజురోజుకి పెరిగిపోయిన...

ఇంటిపంటలు ఆరోగ్యంతో పాటు, మానసిక సంతోషాన్ని కూడా కలిగిస్తాయి. ప్రస్థుత కాలంలో అధిక దిగుబడి కోసం రసాయనాలు వేసి పండించే కూరగాయలు రోజురోజుకి పెరిగిపోయిన క్రమంలో, పట్టణాలలో ఇంటిపంటలు, మిద్దెతోటల సాగు ప్రత్యామ్నాయంగా మారింది. ముఖ్యంగా గృహిణీలు, విశ్రాంత ఉద్యోగులు స్వయంగా తమ ఇళ్ల దగ్గరే పండించుకొని తినే ఆహార పదార్థాలతో సంతృప్తితో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటున్నామంటున్నారు. ఆ విధంగానే కూరగాయలు,పండ్లతో పాటు అరుదైన ఔషధ మొక్కలను సాగు చేస్తున్న సుధాకర్, రమా సుందరి మిద్దెతోటపై ప్రత్యేక కార్యక్రమం.

హైదరాబాద్ హబ్సిగూడకి చెందిన సుధాకర్ విశ్రాంత ఉద్యోగి. మిద్దెతోటలపై నేలతల్లి కథనాలు, నిపుణుల ఇంటిపంట పెంపకాలతో స్ఫూర్తి పొంది స్వయంగా ఇంటిపంట సాగు మొదలుపెట్టారు. మొదట్లో కొంత తడబడినా ఇంటిపంటల సాగుపై అవగాహన పెంచుకొని ఎన్నో రకాల పళ్ళు, కూరగాయల మొక్కలతో పాటు ఔషధ మొక్కలని కూడా పెంచుతున్నారు. ఆకుకూరలు,కూరగాయలు, పండ్ల మొక్కలను మన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో పండించుకోవడం ద్వారా రసాయనాల వల్ల కలిగే రోగాలను కూడా అరికట్టవచ్చని, స్వయంగా సాగు చేసుకుని తింటే ఆ సంతృప్తే వేరంటున్నారు సుధాకర్.

తక్కువ మట్టిని వినియోగించి గ్రోబ్యాగ్స్ పద్ధతిలో మిద్దెతోటలో ఎలాంటి బరువు పడకుండా సహజ ఎరువుల మిశ్రమాన్ని మొక్కల పెంపకంలో ఉపయోగిస్తున్నారు. తీగ జాతి మొక్కలకి ప్రత్యేక పందిర్లను ఏర్పాటు చేయడంతో పాటు, చీడపీడల నివారణకు లింగాకర్షక పత్రాలను అమర్చారు. మొక్కల ఎదుగుదలకు స్వయంగా చౌహాన్ క్యూ పద్ధతిలో ద్రావణాలను తయారుచేసుకుని వాడుతున్నారు.

సేంద్రియ పద్ధతిలో ఇంటిపంటలు సాగు చెయ్యడం వల్ల మన అరోగ్యం బాగుండడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు కలుగుతుందని అంటున్నారు సుధాకర్ భార్య రమా సుందరి. వృత్తిరిత్యా వైద్యురాలైన ఆమె కూరగాయల్లో రసాయనాల ప్రభావం ఎక్కువ ఉంటున్న కారణంగా వాటి వల్ల కలిగే అనారోగ్యాలను అరికట్టాలంటే ఆర్గానిక్ పద్ధతిలో మిద్దెతోటలు పెంచుకోవడమే మేలని అంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories