అపార్ట్‌మెంట్‌లో ఆర్గానిక్ వ్యవసాయం

Terrace Garden
x
Terrace Garden
Highlights

ప్రతి ఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను డంపింగ్‌యార్డులో కాల్చడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని తెలిసిందే. ఈ వ్యర్థాలను పునర్వినియోగం చేస్తే పర్యావరణానికి కొంతలో కొంత మేలు చేసినవారమవుతాము పర్యావరణానికే కాదు మనిషికి ఎంతో మేలు జరుగుతుంది.

ప్రతి ఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను డంపింగ్‌యార్డులో కాల్చడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని తెలిసిందే. ఈ వ్యర్థాలను పునర్వినియోగం చేస్తే పర్యావరణానికి కొంతలో కొంత మేలు చేసినవారమవుతాము పర్యావరణానికే కాదు మనిషికి ఎంతో మేలు జరుగుతుంది. అదే చేసి చూపిస్తున్నారు మోతీనగర్‌కు చెందిన గృహిణి తమ వంటింట్లోంచి వచ్చే వ్యర్థాలను వృథాగా పాడేయకుండా ఎరువుగా దానిని తయారు చేసుకుని మిద్దెతోటలను సాగు చేస్తున్నారు. సేంద్రియ విధానంలో ఇంటి పంటలు పండిస్తూ ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని పంచుతున్నారు.

మోతీనగర్‌ ప్రాంతంలోనీ రాజీవ్ నగర్ కాలనీకి చెందిన రత్నం గారు తమ అపార్ట్‌మెంట్‌ పైన ఉన్న మిద్దెపైన కొద్ది పాటి విస్తీర్ణంలో మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. వంటింట్లో నుంచి వచ్చే ప్రతి వేస్టేజ్ ని ఇంటి పంటలకి ఉపయోగిస్తున్నారు. కుల్లిపోయిన టమాటాలు, పాడైపోయిన వంకాయలు, తినగా మిగిలిన పండ్ల నుంచే సొంతంగా విత్తనాలను తయారు చేసుకుంటున్నారు వాటినే నే మిద్దె తోట సాగుకు వినియోగిస్తున్నారు. ఇలా తయారు చేసిన విత్తనాల నుంచే తమ కుటుంబానికి సరిపడా కూరగాయలను, ఆకుకూరలను పండించుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు.

మొక్కలకు కావాల్సిన ఎరువును వంటింటి వ్యర్థాల నుంచే తయారు చేసుకుంటున్నారు రత్నం. అందుకోసం ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తున్నారు. మొక్కలకు ఎలాంటి పురుగు, చీడపీడలు ఆశించకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. వేపాకు కషాయాన్ని సొతంగా తయారు చేసుకుని ఆ కషాయాన్ని పంటలకు పిచికారీ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories