కొలంబో కంది సాగుతో సిరుల పంట పండిస్తున్న...

Redgram Cultivation
x
Redgram Cultivation
Highlights

అనంతపురం జిల్లా అంటే కరువు కాటకాలే కాదు సిరుల పంటలు పండించే రైతులు ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా రైతు రాణించగలుగుతాడని నిరూపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి వనరులను ఉపయోగించుకుని అధిక దిగుబడులను సాధిస్తున్నారు.

అనంతపురం జిల్లా అంటే కరువు కాటకాలే కాదు సిరుల పంటలు పండించే రైతులు ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా రైతు రాణించగలుగుతాడని నిరూపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి వనరులను ఉపయోగించుకుని అధిక దిగుబడులను సాధిస్తున్నారు. కొలంబో కంది సాగుతో సిరులు కురిపిస్తున్నాడు వజ్రకరూరు మండలానికి చెంది రైతు పరమేశ్వర రెడ్డి. ఆ వివరాలు మీకోసం .

రైతుకు సాగు ఖర్చులు తగ్గాలి , పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలి అందుకోసం రైతు కష్టాల సాగు కాదు ఆదాయాన్ని అందించే పంటలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. పక్క రైతును చూసి ఏదో ఒక పంట వేసామా, దానికి డిమాండ్ ఉన్నా లేకున్నా మార్కెట్‌లో అమ్మామా ఏదో కొంత ఆదాయాన్ని పొందామా అన్నది కాదు వేసే పంట రైతును ఆర్ధిక పురోగతి వైపు అడుగులు వేయించేలా చూడాలి. అప్పుడే రైతు సాగులో కష్టసమయంలో కూడా రాణించగలుగుతాడు అదే చేసి చూపిస్తున్నాడు అనంతపురం జిల్లా రైతు పరమేశ్వర రెడ్డి. ఉన్న కొద్ది పాటి నీటి వనరులను ఉపయోగించుకుని సిరుల పంట పండిస్తున్నాడు.

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామ రైతు పరమేశ్వర రెడ్డి. ఈ రైతు తనకున్న 4 ఎకరాల పొలంలో కంది సాగు చేపట్టాడు. అందులోనూ అందరూ వేసే రకాలు కాదు కొలంబో కందిని పండస్తున్నాడు. వనపర్తి నుంచి సీడ్‌ను సేకరించాడు పరమేశ్వర్ . ఎకరాకు 2 కేజీల విత్తనాన్ని నాటాడు. అంటే 4 ఎకరాలకు 8 కేజీల విత్తనాన్ని వినియోగించారు. కూలీల ఖర్చు, విత్తనాలు, ఎరువుల ఖర్చులన్నీ కలుపుకుని 4 ఎకరాలకు 40 వేల రూపాయల వరకు పెట్టుబడిని పెట్టాడు విత్తనం ఖర్చు కాస్త ఎక్కువగా ఉన్నా ఇది అన్నిరకాల కందికన్నా బాగుందని, తెగుళ్ల సమస్య లేదంటున్నాడు ఈ రైతు.

ప్రస్తుతం పంట దిగుబడి బాగుంది. ఎకరాకు ఎంతలేదన్నీ 10 క్వింటాళ్లకు పైనే దిగుబడి వస్తుందని రైతు ఆనందన్ని వ్యక్తం చేస్తున్నాడు. మార్కెట్‌లో క్వింటా ధర కొలంబో కంది ధర 6 వేల రూపాయలు పలుకుతోంది అయినా మార్కెట్‌లో పంటను విక్రయించకుండా రైతులకు అమ్ముతానని చెబుతున్నాడు ఈ రైతు. అందుకోసం పంటను విత్తనాలుగా మార్చి విత్తచశుద్ధి చేసి గ్రైండిగ్ చేసి కేజీ 300 రూపాయలకు అమ్మకాలు చేస్తానంటున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కు దిగుబడి లభిస్తుండడంతో రైతు ఆనందానికి అవధులు లేవు. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. కట్టింగ్ చేసిన తరువాత రెండో పంట దిగుబడి కూడా ఇదే విధంగా వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories