సాగుతో పాటు నాటు కోళ్ల పెంపకం

సాగుతో పాటు నాటు కోళ్ల పెంపకం
x
Highlights

ప్రకృతి వైపర్యితాలతో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతకు పెరటి కోళ్ల పెంపకం కాస్త చేదోడు వాదోడుగా నిలుస్తుంది. పంటల సాగుతో పాటు అనుబంధ రంగాలైన కోళ్ల...

ప్రకృతి వైపర్యితాలతో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతకు పెరటి కోళ్ల పెంపకం కాస్త చేదోడు వాదోడుగా నిలుస్తుంది. పంటల సాగుతో పాటు అనుబంధ రంగాలైన కోళ్ల పెంపకంపై కూడా క్రమేనా రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కూడా నాటు కోళ్లకు, వాటి గుడ్లకు మంచి గిరాకీ ఉండటంతో రైతులు ముందుకొస్తున్నారు. ఆ కోవలోనే అటు సాగుతో పాటు నాటు కోళ్ల పెంపకంలో అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్న యాదాద్రి జిల్లాకు చెందిన రైతు నరేష్ రెడ్డిపై ప్రత్యేక కథనం.

ఈ యువరైతు పేరు నరేష్ రెడ్డి. యాదాద్రి జిల్లా పాముకుంట గ్రామానికి చెందిన ఈయన వ్వవసాయంతో పాటు అదనపు ఆదాయ వనరుగా గత మూడు సంవత్సరాలుగా కోళ్ల పెంపకం చేపడతున్నాడు. ప్రస్తుతం మార్కెట్‌లో కూడా నాటు కోళ్లకు, వాటి గుడ్లకు మంచి గిరాకీ ఉండటంతో దేశీ జాతికి చెందిన గ్రామ ప్రియ, ఆసిల్, వంటి కోళ్లని పెంచుతున్నాడు.

తన దగ్గర పెంచుకునే కోళ్లు 50 నుండీ 100 వరకు గుడ్లు పెడతాయంటున్నాడు రైతు నరేష్, తనే సొంతంగా ఇంక్యూబేటర్ ద్వారా గుడ్లని పొదిగి కోడి పిల్లలని సైతం విక్రయిస్తున్నాడు. ప్రస్తుత పంట సాగులో ఎప్పుడు వాతావరణంతో దెబ్బతింటుందో తెలియని పరిస్థితుల పెరటి కోళ్ల పెంపకం కాస్త ఆసరాగా ఉంటున్నదని అంటున్నాడు. ఇంట్లో చిన్నపాటి ఖర్చులకు పెరటి కోళ్ల పెంపకం లాభదాయకంగా ఉందని అంటున్నాడు రైతు నరేష్.

నాటుకోళ్లకు ప్రత్యేకంగా దాణా అవసరం లేకుండా తన పొలంలో పండే గింజలను, ఆరబయట దొరికే పురుగు పుట్రనే వాటి మేత అని నీటి విషయంలోనూ పోలంలో గుంటల్లో ఉండే నీటినే ఇస్తానని కోళ్లను ఎండ, వాన, చలి నుంచి కాపాడే విధంగా ఏర్పాటు చేయాలి. ఈ విధంగా తగిన వసతి మేత లభించే ఏర్పాటు చేస్తే పెరట్లో పెంచుకునే అభివృద్ధి పరిచిన కోళ్ల ద్వారా అధిక ఉత్పత్తిని, ఆదాయాన్ని పొందవచ్చు అని అంటున్నాడు యువరైతు.


Show Full Article
Print Article
Next Story
More Stories