Andhra Pradesh: కడప జిల్లా బత్తాయి రైతులకు దెబ్బ మీద దెబ్బ

Andhra Pradesh: కడప జిల్లా బత్తాయి రైతులకు దెబ్బ మీద దెబ్బ
x
Highlights

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది కడప జిల్లా బత్తాయి రైతుల పరిస్థితి. లాక్ డౌన్ సమయంలో అమ్మకాలు తగ్గిపోయి విలవిల్లాడిన రైతులు ఇప్పుడు వ్యాపారుల...

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది కడప జిల్లా బత్తాయి రైతుల పరిస్థితి. లాక్ డౌన్ సమయంలో అమ్మకాలు తగ్గిపోయి విలవిల్లాడిన రైతులు ఇప్పుడు వ్యాపారుల చేతిలో చితికిపోతున్నారు. రికార్డు స్థాయిలో దిగుబడి ఉన్నా అమ్మకాలు లేక అవస్థలు పడుతున్నారు. సూట్ పేరుతో దళారులు దోపిడి చేస్తుండడంతో సాగు ఖర్చులు కూడా మిగిలే పరిస్థితి లేదని విలపిస్తున్నారు. బత్తాయి రైతుల సూట్ కష్టాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

కడప జిల్లా అంటేనే ఉద్యాన పంటలకు ప్రధాన కేంద్రం. ప్రతీ ఏటా కోట్లు విలువజేసే పంటలు ఇక్కడి నుంచి దేశ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయి. కానీ ఈ ఏడాది లాక్ డౌన్ కారణంగా ఎగుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ధరలు కూడా విపరీతంగా పడిపోయాయి. దీంతో అరటి, చీనీ, నిమ్మ రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు మొదలవ్వడంతో కాస్త అమ్మకాలు జోరందుకున్నాయి. కానీ ధరలు మాత్రం తీవ్రంగా పడిపోయాయి. ఇప్పుడు సూట్ రూపంలో వ్యాపారులు చేస్తున్న దగా చీనీ రైతులను మరింత కుంగదీస్తోంది.

కడప జిల్లాలో సుమారు 20 వేల హెక్టార్లలో చీనీ సాగైంది. కృష్ణా జలాలు పుష్కలంగా రావడంతో జిల్లాలో ఈ ఏడాది చీనీ దిగుమతులు భారీగా పెరిగాయి. దీంతో రైతులు తమ కష్టాలు తీరబోతున్నాయని ఆశపడ్డారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లింది లాక్ డౌన్. 80 రోజులుగా ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానికంగా అమ్ముకునే అవకాశం కూడా లేదు. కనీసం కూలీ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో కాయలను కోయకుండానే చెట్లపై వదిలేశారు. గత ఏడాది చీనీ టన్ను ధర 50 వేల నుంచి 60 వేలు పలికితే ఈ ఏడాది 10 వేలు కూడా పలికే పరిస్థితి లేదు. ఎక్కువ కాలం నిల్వ ఉండే పరిస్ధితి లేకపోవడంతో వచ్చిన కాడికి రైతులు అమ్మేందుకు మొగ్గుచూపుతున్నారు.

ఎగుమతులు, ధరలు లేక సతమతమవుతున్న రైతుల వద్ద వ్యాపారులు సూట్ వసూలు చేస్తున్నారు. చాలా కాలంగా కడప జిల్లాలో తరుగు పేరుతో రైతుల వద్ద వ్యాపారులు సూట్ వసూలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది రైతుల నుంచి సూట్ తీసుకోకూడదని సీఎం ఆదేశాలు జారీ చేసినా ఎందుకు వసూలు చేస్తున్నారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ కోసిన పంటలను నిల్వ ఉంచుకోలేక వ్యాపారులు అడిగిన సూట్ ను ఇవ్వకతప్పడం లేదని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories