ఆధునిక పద్ధతుల వైపు మళ్లుతున్న మత్స్యకారులు

ఆధునిక పద్ధతుల వైపు మళ్లుతున్న మత్స్యకారులు
x
ఆధునిక పద్ధతుల వైపు మళ్లుతున్న మత్స్యకారులు
Highlights

మత్స్యకారులు ఆధునిక పద్ధతుల వైపు మళ్లుతున్నారు. కేవలం సముద్రంలో వేటకెళ్లి చేపలు పట్టడమే కాకుండా సాంకేతికను వినియోగించుకుంటూ వివిధ రకాల చేపల పెంపకం...

మత్స్యకారులు ఆధునిక పద్ధతుల వైపు మళ్లుతున్నారు. కేవలం సముద్రంలో వేటకెళ్లి చేపలు పట్టడమే కాకుండా సాంకేతికను వినియోగించుకుంటూ వివిధ రకాల చేపల పెంపకం చేపడుతున్నారు. కొత్త పుంతలు తొక్కుతోన్న జలపుష్పాల పెంపకంపై hmtv ప్రత్యేక కథనం.

సముద్రం, నదులు, చెరువులు వంటి సంప్రదాయ జలవనరుల్లో కష్టాలకు ఎదురీతుతూ చేపలను పట్టడం అలాగే, పెంచడం గంగపుత్రులకు మాత్రమే తెలిసిన విద్య. అయితే, జలపుష్పాల పెంపకం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. నీలి విప్లవంతో ఆధునికతను సంతరించుకుంటోంది. కేజ్ కల్చర్‌ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త విధానం ఇప్పుడందరినీ ఆకట్టుకుంటోంది.

కేంద్ర సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసిన ఈ కేజ్‌ కల్చర్ 2005 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో చేపల పెంపకంలో రిస్క్ తక్కువగా, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. పండుగప్పలతో ఈ కేజ్ కల్చర్‌ సాగును మొదలుపెట్టిన ఈ సంస్థ, ప్రస్తుతం గ్రూవర్ ఇండియన్ పాంపనో రకం చేపలను ఉత్పత్తి చేస్తోంది. విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 15 కేజుల్లో ఇండియన్ పాంపనో, ముక్కుపారల చేపల ఉత్పత్తి చేపట్టారు. మార్కెట్లో వీటికి మాంచి డిమాండ్ ఉండటం, అలాగే, పెంపకం సులభం కావడంతో సంప్రదాయ మత్స్కకారులపాటు వ్యాపారులు కూడా వీటిపై ఆసక్తి చూపుతున్నారు.

ఇక, రాష్ట్రవ్యాప్తంగా 100 కేజ్‌లను ఏర్పాటు చేయగా, ఒక్క విశాఖలోనే 15 కేజుల్లో చేపల పెంపకం నిర్వహిస్తున్నారు. అయితే, సముద్రంలో వేటకెళ్లి చేపలు పట్టి అమ్ముకునే పద్ధతి నుంచి చేపల పెంపకం చేపట్టి, సులువుగా మార్కెటింగ్ చేసుకునే సదుపాయాలు అందుబాటులోకి రావడంపై మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories