ఆరోగ్యంగా ఉండాలంటే మిద్దెతోటలను పెంచాల్సిందే...

ఆరోగ్యంగా ఉండాలంటే మిద్దెతోటలను పెంచాల్సిందే...
x
Highlights

మూడు పదుల వయస్సు దాటిన చాలా మంది షుగర్ బారిన పడుతున్నారు బీపీ వ్యాధితో బాధపడుతున్నారు. వీరే కాదు చిన్న వారి నుంచి పెద్దవారి వరకు చాలా మందిలో రోగనిరోధక...

మూడు పదుల వయస్సు దాటిన చాలా మంది షుగర్ బారిన పడుతున్నారు బీపీ వ్యాధితో బాధపడుతున్నారు. వీరే కాదు చిన్న వారి నుంచి పెద్దవారి వరకు చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. ఆరోగ్యం అనుకుంటున్న కూరగాయలు పండ్లు తమ మెనూలో ఉన్నా ప్రాణాంతక వ్యాధుల బారిన పడాల్సివస్తోంది వీటన్నింటికి కారణం సరైన ఆహారం, అందులోనూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకపోవడమే అందుకే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దానిని కాపాడుకోవాలంటే ప్రతీ ఒక్కరు మిద్దె తోటలను పండించాల్సిందే అందుకే తమ జీవీతాన్ని ఆనందంగా మలుచుకుని , ఆరోగ్యంగా జీవించేందుకు ఓల్డ్ సిటీకి చెందిన మహమ్మద్‌ సాహేరా బేగం దంపతులు మిద్దె తోటలను సాగు చేస్తున్నారు.

మనం ఏదైనా పని చేస్తే అది నలుగురికి ఉపయోగపడాలి చేస్తున్న పని ద్వారా సంతృప్తి పొందాలి. అలా అనుకునే చాంద్రయణగుట్టకు చెందిన సాహేరా బేగం తన 100 గజాల మేడ మీద మిద్దె తోటల సాగు చేపట్టారు. సాహేరా బేగం కు బీపీ, షుగర్‌ ఉన్నాయి. వీటిని అధిగమించేందుకు ఈమె టెర్రెస్ గార్డెన్ ను ప్రారంభించారు. ఉదయం సాయంత్రం 2 గంటల పాటు మొక్కల మధ్య గడుపుతారు ఆరోగ్యకరమైన ఉత్పత్తిని పొందుతున్నారు దీంతో గత సంవత్సరం నుంచి తాను హాస్పిటల్ మొహం చూడలేదంటున్నారు సాహేరా బేగం

తమ ఇంటికి అవసరమైన కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు ఇంట్లోనే సాగు చేస్తున్నారు సాహేరా బేగం. మొదట పూల మొక్కలను పెంచడం మొదలు పెట్టి ఈమె మెళ్లి మెళ్లిగా కూరగాయలు ఆ తరువాత జీగ జాతి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను పండిస్తున్నారు. ఆరు నెలలుగా మొక్కల నుంచి మంచి ఉత్పత్తి లభిస్తోందని అంటున్నారు ఈమె. మొక్కలకు కావాల్సిన పోషకాలన్నింటిని అందించేందుకు సహజ ఎరువును వినియోగిస్తున్నారు. ఆవు వ్యర్థాలతో పాటు కిచెన్ నుంచి వచ్చిన వేస్టేజ్‌తో ఎరువును తయారు చేసుకుని మొక్కలకు అందిస్తున్నారు. వేసవి కాలంలో నీటికి కాస్త సంవర్థవంతంగా వినియోగించుకుంటూ మొక్కలను కాపాడుకుంటే ఆ తరువాత కాలంలో ఎలాంటి చింతా ఉండదంటున్నారు. మిద్దె తోటల ద్వారా నాణ్యమైన కూరగాయలతో పాటు శారీరక వ్యాయామం ఉంటుందని అందరూ ఈ తోటలను సాగు చేసుకోవాలని సాహేరా బేగం చెబుతున్నారు.

మిద్దె తోటలను పండించుకోవడం ఎంతో తేలికైన విషయం అని అంటున్నారు సాహేరా బేగం భర్త మహమ్మద్‌ కాస్త ఓపిక చేయాలనే తపన ఉంటే మన ఇంట్లోనే కూర్చుని సర్వరోగాలను నయం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం ఎంత అవసరమో ఆరోగ్యకంగా జీవించడం కూడా అంతే అవసరం అని అంటున్నారు. ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా జీవించవచ్చని చెబుతున్నారు. అందుకే తమకు చేతకాదని, మొక్కలను పెంచలేమని అనుకునే వారు ఆ అనుమానాలను పక్కన పెట్టి ఇంట్లోనే మొక్కలను పెంచి ఆహ్లాదంగా జీవించాలని సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories