వాణిజ్య పంటలతో ముందడుగు వేస్తున్న రామడుగు మండల రైతులు!

వాణిజ్య పంటలతో ముందడుగు వేస్తున్న రామడుగు మండల రైతులు!
x
Highlights

సరికొత్త పంటల విధానం విషయంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ప్రభుత్వాన్ని ఆకర్షిస్తోంది. వరి, పత్తి తదితర పంటలతో నష‌్టపోయిన ఆ ప్రాంత రైతులు వాణిజ్య...

సరికొత్త పంటల విధానం విషయంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ప్రభుత్వాన్ని ఆకర్షిస్తోంది. వరి, పత్తి తదితర పంటలతో నష‌్టపోయిన ఆ ప్రాంత రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించారు. తక్కువ నీటితో పండ్ల పంటలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు.

తెలంగాణలో నియంత్రిత పంట సాగు విధానంపై ప్రభుత్వం తీవ్ర ఆసక్తి చూపుతోంది. జోన్లవారీగా ప్రాంతాలను విభజించి ఏ ప్రాంతంలో ఏయే పంటలు వేయాలనేదానిపై సూచనలు చేయనుంది. ఈ నేపథ్యంలో వాణిజ్య పంటలు పండిస్తున్న కరీంనగర్ జిల్లా రామడుగు మండలంపై సర్కార్ దృష్టి సారించింది. ఈ మండలంలో రైతులు తక్కువ నీటితో వాణిజ్య పంటలు పండించి లాభాల బాటలో పయణిస్తున్నారు.

శ్రీనివాస్ అనే యువ రైతు ముంబైలో క్రియేటివ్ రంగంలో తన ఉద్యోగాన్ని వదులుకుని సొంత ప్రాంతం రామడుగు మండలంలోని తిర్మలాపూర్ కు వచ్చేశారు. తనకున్న వ్యవసాయ భూమిలో వివిధ రకాలపంటలు వేసి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం అంజీర వేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు తీసుకుంటు అంజీరను సాగు చేస్తున్న శ్రీనివాస్ సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. గతంలో కూరగాయల పండిస్తే అంతగా లాభాలు రాలేదు. ఇప్పుడు వాణిజ్య పంటలతో లాభాలు గడిస్తున్నారు.

రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని రామచంద్రరెడ్డి అనే రైతు డ్రాగన్ ఫ్రూట్ వేశారు. దీంతో పాటుగా బొప్పాయి, పుచ్చకాయ పంటలను కూడా సాగు చేస్తున్నారు. పండ్ల తోటల సాగులో ఆరంభంలో నష్టాలు చవిచూసిన ఈ రైతు ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు.

అంజీరను పండిస్తున్న శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పరిశీలించారు. అంజీరా సాగు విధానం గురించి తెలుసుకున్నారు. యువ రైతును అభినందించిన ఆయన వాణిజ్య పంటలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు.

గతంలో రామడుగు మండలంలో కరవుతో భూములు బీడుగా ఉండేవి. తక్కువ నీటితో వాణిజ్య పంటల విధానం సక్సెస్ కావడంతో ఇక్కడి రైతులు జీవితాలు మారిపోతున్నాయి. సరికొత్త వ్యవసాయ విధానంలో భాగంగా రామడుగు రైతులను ప్రభుత్వం మరింత ప్రోత్సహించనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories