అతి వర్షాలకు పత్తి రైతులు అతలాకుతలం

అతి వర్షాలకు పత్తి రైతులు అతలాకుతలం
x
Highlights

అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందంగా మారింది జోగులాంబ గద్వాల జిల్లాలోని పత్తి రైతుల పరిస్థితి. సకాలంలో వరుణుడు కరిణించాడని...

అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందంగా మారింది జోగులాంబ గద్వాల జిల్లాలోని పత్తి రైతుల పరిస్థితి. సకాలంలో వరుణుడు కరిణించాడని మురిసిపోయిన రైతన్నలకు ఆ సంతోషాన్ని ఎక్కువ రోజులు నిలువనీయలేదు. ఎంతో ఉత్సాహంగా పత్తి విత్తనాలు నాటిన వారికి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యదికంగా పత్తి పంట సాగు చేసే గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని పత్తి రైతులు ఆదిలోనే ఆందోళనకు గురయ్యే పరిస్థితులు తలెత్తింది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 1 లక్ష 64 వేల 375 ఎకరాల విస్థీర్ణంలో పత్తి సాగు నమోదైంది. విత్తనం వేసినప్పుడు నుంచి ఇప్పటి వరకు దాదాపు నెల రోజుల నుంచి విరామం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అసలే నల్లరేగడి పొలాలు ఆపై ఒక్కసారి వర్షం పడితే వారం రోజుల వరకు తడియారని పరిస్థితి. దీంతో పత్తి సాగు చేసిన రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు.

ఇదిలా ఉంటే పొలంలో మిగిలిన ప్రాంతం కలుపు మొక్కల బెడద కూడా రైతుకు మరో సమస్యగా మారింది. సేద్యానికి వీలుగాని వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో పత్తి రైతన్న దిక్కుతోచని స్తితిలో పడిపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొందరు పంటలు వేయకుండా పొలాలను బీడుగా వదిలేస్తున్నారు. ఎలాగోలా కష్టపడి విస్తారంగా సాగు చేస్తున్న పత్తి రైతుల పొలాల్లో వర్షం కారణంగా కలుపు తీత పనులకు కూలీల కొరత కూడా తోడైంది. కరోనా వైరస్ ప్రభావంతో ఇతర గ్రామాల నుంచి కూలీలు రాక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

భారతదేశంలోనే పత్తి పంట సాగు అంటే జోగులాంబ గద్వాల జిల్లా గుర్తుకు వస్తుంది. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా పండిన పత్తి విత్తనాలకు చాలా డిమాండ్ ఉంటుంది. వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే విత్తనాలు ఈ ప్రాంతం నుంచే సరఫరా అవుతుంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఉత్పత్తయ్యే పత్తి వినాలను ప్రముఖ సీడ్స్ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ఈసారి జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే విదంగా వ్యవసాయాదారులు ప్రణాళిక చేసుకున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం లో వర్షాలు ఎక్కువ పడటంతో రైతులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఎక్కువ ఉందని, కాబట్టి రైతులందరు పంట పొలాల్లో ఎక్కువ నీళ్లు నిలువ ఉండకుండా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. సకాలంలో వర్షాలు కురిసాయని సంబరంలో ఉన్న పత్తి రైతులకు ఎడతరపి లేకుండా కురుస్తున్న వర్షాలు తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. పంటపొలాల్లో విత్తిన విత్తనాలను నష్టపోతున్న రైతులను గుర్తించి ప్రభుత్వం రాయితీతో కూడిన విత్తనాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories