అతివృష్టితో అనంతపురం జిల్లాలో నీట మునిగిన పంటలు

అతివృష్టితో అనంతపురం జిల్లాలో నీట మునిగిన పంటలు
x
Highlights

అతివృష్టి అన్నదాతల కొంప ముంచింది. చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోయింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతపురంలో వేరుశనగ రైతులు...

అతివృష్టి అన్నదాతల కొంప ముంచింది. చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోయింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతపురంలో వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎడితెరిపి లేని వర్షాలతో పొలాల్లోనే పంటలు కుళ్లిపోయే పరిస్థితి నెలకొంది. లక్షలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట వర్షాలకు నేలపాలు కావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అనంతలో దెబ్బతిన్న పంటలపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.

ఏటా పంటలు ఎండిపోయి కరువు ఛాయలు కమ్ముకునే అనంతపురం జిల్లాలో ఈ ఏడాది భారీ వర్షాలు రైతులను నిండా ముంచాయి. దీంతో వేరుశనగ, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మడకశిర, పెనుకొండ, రాప్తాడు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి నియోజకవర్గాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరి, పత్తి పంటలు కూడా నీట మునగడంతో రైతులు లక్షల్లో పెట్టుబడులు కోల్పోయారు.

అకాల వర్షాలతో నిండా మునిగిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని కోత సమయంలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు రైతులకు అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. వరినాట్లు వేసిన వారం రోజుల నుంచి నీటిలో మునగడంతో కుళ్లిపోయాయని పత్తి ఇతర పంటలకు జిల్లాల్లో పెద్దఎత్తున నష్టం వాటిళ్లిందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories