వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంభిస్తున్న రైతు

వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంభిస్తున్న రైతు
x
Highlights

వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంభిస్తే లాభాలు వాటంతటవే రైతును వెతుక్కుంటూ వస్తాయని నిరూపిస్తున్నాడు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ యువరైతు. అరుదుగా...

వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంభిస్తే లాభాలు వాటంతటవే రైతును వెతుక్కుంటూ వస్తాయని నిరూపిస్తున్నాడు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ యువరైతు. అరుదుగా పండించే తెల్లజామ పండ్ల తోటలను ఎంచుకుని వాటిని పండిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి అనే యువరైతు. ఐదెకరాల్లో నాటి కేవలం నాలుగేళ్లలోనే పూర్తి స్థాయిలో లాభాలను అర్జిస్తున్న ఆ యువరైతుపై ప్రత్యేక కథనం.

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని శేషంపల్లి గ్రామానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి అనే ఈ యువరైతు పండ్ల, కూరగాయల తోట సాగులో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. కొత్త కొత్త వెరైటీల సాగులో భాగంగా ఆయన తైవాన్ తెల్ల జామ సాగు చేస్తూ, అధిక దిగుబడులను సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. జామ సాగుపై ఆసక్తి కలిగి ఉన్న జగన్ మోహన్ రెడ్డి చత్తీస్ ఘడ్ రాష్ట్రం రాయ్ ఘడ్ జిల్లాలోని తైవాన్ జామ క్షేత్రాన్ని సందర్శించి దిగుబడి, మార్కెటింగ్ సౌకర్యాలపై అవగాహన పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో 4 సంవత్సరాల క్రితం ఎకరానికి 400 మొక్కల చొప్పున 5 ఎకరాలలో రెండు వేల మొక్కలు సాగు చేశాడు. ఈ రకం పది సంవత్సరాల పాటు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందన్న కారణంతో ఈ తోటను సాగు చేస్తున్నాడు ఈ యువరైతు.

రెండు సంవత్సరాల పాటు మొక్క ఎదుగుదలకు భూ సంరక్షణ, పురుగుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కాయ నాణ్యత, వివిధ ఫంగస్ తెగుళ్ల నివారణకు మూడు లేయర్ల బ్యాగింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించాడు. దీని ద్వారా ఎకరానికి పది టన్నుల దిగుబడి సాధించవచ్చన్నారు. దాదాపు 6 లక్షల వరకు రాబడి రాగా, అందులో 3 లక్షలు పెట్టుబడులకు ఖర్చు కానున్నాయని ఆసక్తిగల రైతులకు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుందన్నారు.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్ జిల్లాలోని వి.ఎన్ .ఆర్ కంపెనీ యొక్క జామ మొక్కలను 4 సంవత్సరాల క్రితం ఐదు ఎకరాల్లో సాగు చేశామని రెండు సంవత్సరాల వరకు ఆర్గానిక్ ఎరువులు వేసి బాగా పెంచామన్నారు. రెండు సంవత్సరాల తర్వాత కాపు వదిలి ప్రతి కొమ్మకు కాసిన కాయలకు మూడు లేయర్లు గా బ్యాగింగ్ చేయడం జరిగిందన్నారు. అంతేకాక ఫోమ్ నెట్, ఆంటీ ఫాగ్ కవర్ పేపర్ ను వేయడంతో దిగుబడి బాగా వచ్చిందని రైతు తెలిపారు. అంతే కాకుండా పండ్లపై మాత్ ఫంగస్ బ్యాక్టీరియా సంబర్ నుంచి కాపాడడానికి బ్యాగింగ్ చేశామంటున్నారు.

మొక్కలు వేసిన రెండున్నర సంవత్సరాల తర్వాత పూత పచ్చి కాయ కాసింది. కాయ మంచి పరిమాణంలో ఉండడంతో మార్కెట్లో కేజీకి 60 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ప్రతి ఎకరానికి 400 ముక్కల చొప్పున నాటడంతో పాటు వాటి నుంచి 10 టన్నుల దిగుబడి పొందుతూ 6 లక్షల మేర ఆదాయం పొందుతున్నారు. ఎకరానికి మూడు లక్షల వరకు పెట్టుబడులు పోగా మూడు లక్షలు లాభం వస్తుందని మంచి నాణ్యమైన పంటను పొందుతూ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న దృష్ట్యా ఆసక్తిగల రైతులు సాగుకు అనుకూలంగా ఉంటుందన్నారు రైతు జగన్ మోహన్ రెడ్డి.

నాణ్యమైన జామకాయ ఉన్నందున బాంబే, విదేశాలకు సైతం సరఫరా చేసేందుకు వ్యాపారస్తులు ముందుకు వస్తున్నారన్నారు. ఎప్పటి లాగే రోటీన్ పంటలను వేయకుండా పంట మార్పిడితో లాభాల బాట పట్టవచ్చని యువరైతు జగన్ మోహన్ రెడ్డి నిరూపిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories