మీ భూమిపై మీ హక్కులు భద్రంగా ఉన్నాయా

Arun Chilukuri
Published on: 9 Jan 2021 4:02 PM IST
PM Modi’s Svamitva Scheme Benefits
X

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారల కోసం కెంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కొత్త చట్టాలు, సవరణల పనిలో పడ్డాయి. ఆ క్రమంలోనే గ్రామ కంఠం, ఆబాదీ భూములకు సంబంధించి గ్రామాల్లోని ఆస్తుల సర్వేకు కేంద్ర ప్రభుత్వం "స్వమిత్వ" పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే రాబోయే నాలుగేళ్లలో సర్వేను పూర్తి చేయాలని యోచిస్తున్న ఈ పథకం లక్ష్యాలేంటి ? గ్రామస్థాయిలో జరిగే ఈ సర్వేలో భూ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు దొరుకుతాయి ?

సరైన భూ రికార్డుల ఉంటేనే భూమికి భద్రత ఉంటుంది. ఎప్పటికప్పుడు భూ సంబంధిత రికార్డులు సరి చూసుకుంటే భూ హక్కులకు ఎలాంటి ముప్పు ఉండదనేది నిపుణుల మాట. ఈ నేపథ్యంలో భూ హక్కుల భద్రత, భూమి రికార్డుల మీద అవగాహనపై పలు ఆసక్తికర నిజాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో ఏ భూమికి ఎలాంటి రికార్డులు ఉండాలి ? ఏ రికార్డులు ఉంటే భూమికి భద్రత ఉన్నట్టు ? భూ పరిపాలనలో కొత్త చట్టాలు, సవరణలు ఏ విధంగా ఉపయోగపడతాయి ? వంటి అంశాల గురించి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story