కిసాన్ పెన్షన్ కోసం రైతు చెల్లించాల్సింది నెలకు వంద రూపాయలే!

కిసాన్ పెన్షన్ కోసం రైతు చెల్లించాల్సింది నెలకు వంద రూపాయలే!
x
Highlights

మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత రైతులకు పెన్షన్‌ స్కీమ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజన పథకం కింద...

మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత రైతులకు పెన్షన్‌ స్కీమ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజన పథకం కింద పింఛను ఇస్తామన్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి రైతులు నెలకు 100 రూపాయలను చెల్లించాలని కేంద్రం తెలిపింది. అంతే మొత్తాన్ని రైతుల తరఫున ప్రభుత్వం జమ చేయనుంది. ఎల్‌ఐసీ ద్వారా ఈ స్కీమ్ ని కేంద్రం అమలు చేయనుంది. నెలకు 100 చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత 3 వేల పెన్షన్ ఇస్తారు. ఈ పథకానికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులు మాత్రమే అర్హులు.

ప్రధానమంత్రి కిసాన్‌ పింఛను పథకం ద్వారా లబ్ధి పొందేందుకు రైతన్నలు తమవంతుగా నెలనెలా 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రప్రభుత్వం తెలిపింది. అన్నదాతల పేరిట అంతే మొత్తాన్ని తాము కూడా పింఛను నిధికి జమ చేస్తామని వెల్లడించింది. రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో నిర్వహించిన దూరదృశ్య సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పింఛను పథకం గురించి చర్చించారు. వీలైనంత త్వరగా దాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. పథకంపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పింఛను పథకంలో చేరేందుకు అర్హులైన 18-40 ఏళ్ల మధ్య వయసున్న రైతుల వివరాలు నమోదు చేయాలని కోరారు. ఈ పథకంలో చేరే అన్నదాతలు నెలనెలా రూ.100 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రీమియం వయసులవారీగా మారుతుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం ద్వారా అందే సొమ్ము నుంచి రైతులు నేరుగా పింఛను వాటా చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం మోదీ ప్రభుత్వం తొలి కేబినెట్‌ సమావేశంలో ప్రధానమంత్రి కిసాన్‌ పింఛను పథకాన్ని ప్రవేశపెట్టింది. వృద్ధాప్యంలో రైతన్నలకు బాసటగా నిలవడం దాని ఉద్దేశం. ఈ పథకంలో చేరే రైతులకు 60 ఏళ్ల వయసు నుంచి నెలనెలా కనీసం రూ.3,000 పింఛను అందజేస్తారు. పీఎం కిసాన్‌ పింఛను నిధి నిర్వహణ, పింఛను చెల్లింపు బాధ్యతలను ఎల్‌ఐసీ చూసుకుంటుంది. తొలి మూడేళ్లలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది రైతన్నలకు పింఛన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఏటా 10వేల 774 కోట్లు ఖర్చవుతాయని అంచనా.

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకానికి అర్హులైన రైతుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కోరారు. తద్వారా అన్నదాతలకు ఈ ఏడాది ఏప్రిల్‌-జులై కాలానికి అందాల్సిన నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయవచ్చునని తెలిపారు. అర్హులైన రైతులందరికీ పీఎం కిసాన్‌ పథకం ద్వారా కేంద్రప్రభుత్వం ఏటా రూ.6 వేల ఆర్థిక సహాయం అందిస్తుంది. మరోవైపు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్రాలను తోమర్‌ కోరారు. రానున్న 100 రోజుల్లో ఈ పథకం కింద కొత్తగా కోటిమందిని చేర్పించాలని పిలుపునిచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories