Kisan Credit Card: మీకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉందా.. ఈ విషయాలు అస్సలు నమ్మొద్దు..!

PIB Fact Check Interest Waiver on Kisan Credit Card is Not True
x

Kisan Credit Card: మీకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉందా.. ఈ విషయాలు అస్సలు నమ్మొద్దు..!

Highlights

Kisan Credit Card: దేశంలో పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో పాటు సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.

Kisan Credit Card: దేశంలో పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో పాటు సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. నకిలీ వార్తలని వ్యాపింపజేసి దానినుంచి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి మోసాలను అరికట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. PIB ఫాక్ట్ చెక్ అన్నిటిని గమనించి ప్రజలకి నిజమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. గత కొన్ని రోజులుగా ఒక మెస్సేజ్‌ వేగంగా వైరల్ అవుతోంది. ఏప్రిల్ 1, 2022 నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై వడ్డీ ఉండదని ఈ మెస్సేజ్‌లో ఉంది. ఈ వైరల్ న్యూస్‌లో రూ. 3 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకున్న రైతులు ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు.

అయితే ఈ న్యూస్‌ని PIB తనిఖీ చేసింది. ఇది పూర్తిగా ఫేక్ (ఫేక్ న్యూస్) అని ట్వీట్ చేయడం ద్వారా సమాచారం ఇచ్చింది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు వడ్డీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై రైతులు 7 శాతం వడ్డీ రేటు చెల్లించాలని పిఐబి చెప్పింది. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని పిఐబి తెలిపింది. ఒక వార్తాపత్రికలో ముద్రించిన కథనానికి సంబంధించిన ఈ వార్త పూర్తిగా ఫేక్ అని రైతులు నమ్మవద్దని సూచించింది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డును చౌకగా అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories