సుభాష్ పాలేకర్ విధానంలో శభాష్ అనిపిస్తున్న రైతులు

సుభాష్ పాలేకర్ విధానంలో శభాష్ అనిపిస్తున్న రైతులు
x
ప్రకృతి వ్యవసాయం
Highlights

ఈ సృష్టిలో మట్టితో మమేకం అయ్యేది ఇద్దరే ఇద్దరు నేలపై ఆడుకునే చిన్నపిల్లలు ఒకరైతే, ఇంకొకరు అదే నేలను సాగుకునే రైతులు!! ఒకప్పుడు వ్యసాయానికి చదువు అవసరం...

ఈ సృష్టిలో మట్టితో మమేకం అయ్యేది ఇద్దరే ఇద్దరు నేలపై ఆడుకునే చిన్నపిల్లలు ఒకరైతే, ఇంకొకరు అదే నేలను సాగుకునే రైతులు!! ఒకప్పుడు వ్యసాయానికి చదువు అవసరం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థుతుల్లో చదువుకున్న యువత వ్యవసాయానికి చాలా అవసరం, దేశ పురోగతికి మొదటి మెట్టు కూడా వ్యవసాయమే. రాను రానూ ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తున్న క్రమంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు మొదలుకొని ఎంతో మంది యువత ప్రకృతి వ్యవసాయం వైపు మల్లుతున్నారు. ఆ కోవలోకే వస్తాడు గుంటూరు జిల్లా , తూములూరు గ్రామానికి చెందిన యువ రైతు కొండా కిశోర్ రెడ్డి. చదివింది బిజినెస్ మానేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్...! ఏ కార్పొరేట్ సంస్థలోనో ఉద్యోగం చేయకుండా నేలతల్లి మీద ప్రేమ, వ్యవసాయం మీద అభిమానంతో సుభాష్ పాలేకర్ విధానంలో ప్రకృతి సేద్యం చేస్తున్నాడు. పూర్తి స్థాయి సేంద్రియ పద్దతిలో సమగ్ర వ్యసాయం చేస్తున్న ఈ యువరైతు పై ప్రత్యేక కథనం.

గుంటూరు జిల్లా , తూములూరు గ్రామానికి చెందిన యువరైతు కొండా కిశోర్ రెడ్డి కుటుంబ నేపథ్యం ముందు నుండి వ్యవసాయమే బిజినెస్ మానేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి అందరి లాగా ఉద్యోగం చేయకుండా, వ్యవసాయం వైపు మల్లాడు. మొదట రసాయనిక సేద్యం చేసిన ఈ రైతు సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులకు హజరై పూర్తి స్థాయి ప్రకృతి విధానంలో సాగు ప్రారంభించాడు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సమగ్ర పద్దతిలో అరటి తోటను పెంచుతూ పసుపు, కంద వంటి వాటిని అంతర పంటలుగా సాగు చేస్తున్నాడు.

పాలేకర్ విధానంలో తక్కువ పెట్టుబడితో అరటి తోటను సాగు చేస్తూ మంచి దిగుబడిని పొందడమే కాకుండా ప్రకృతి వ్యవసాయంలో భాగమైన అంతర పంటల విధానాన్ని పాటించడంతో పాటు కోత కోసిన అనంతరం అరటి మొక్కల బెరడుతో కూడా అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు ఈ రైతు. అంతర పంటల వల్ల కలిగే లాభాలేంటి? అరటి సాగులో ఎలాంటీ అంతర పంటలు వేసుకోవచ్చు? కోత అనంతరం అరటి మొక్కలతో ఎలాంటి ఉపయోగాలుంటాయి? సమగ్ర సాగు విధానం గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories