సేంద్రియ పద్దతిలో ఇంటిపంట

సేంద్రియ పద్దతిలో ఇంటిపంట
x
ఉషారాణి
Highlights

గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఇంటిపంటలు, నేడు నగరాలకు కూడా విస్తరించాయి. రసాయనాలు లేకుండా స్వయంగా పండించుకునే మిద్దె, పెరటితోటలకు ఉద్యోగస్తులు,...

గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఇంటిపంటలు, నేడు నగరాలకు కూడా విస్తరించాయి. రసాయనాలు లేకుండా స్వయంగా పండించుకునే మిద్దె, పెరటితోటలకు ఉద్యోగస్తులు, గృహిణీలు, విశ్రాంత ఉద్యోగులు మొదలుకొని చాలా మంది నగరవాసులు ఆసక్తి చూపెడుతున్నారు. ఆ విధంగానే చిన్నప్పటి నుండి ఉన్న ఆసక్తితో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తూనే మిద్దెతోటలతో తన ఇంటి ఆవరణాలని నింపేశారు హైదరాబాద్ కు చెందిన ఉషారాణి. ఆర్గానిక్ పంటలపై తన కుమారుడికి సైతం స్ఫూర్తిగా నిలిచి, సకుటుంబంగా సాగు చేస్తున్న ఆమె మిద్దెతోట పై ప్రత్యేక కథనం.

హైదరాబాద్ కు చెందిన ఉషారాణికి చిన్నప్పటి నుండి మొక్కల పెంపకమంటే ఆసక్తి ఎక్కువ. వ్యాపకంగా చిన్న చిన్న పూలకుండీల్లో మొక్కలు పెంచే ఆమె, తరువాత క్రమంలో కూరగాయల్లో పెరుగుతున్న రసాయనాలు తరుగుతున్న పోషకాలను గమనించి, స్వయంగా పూర్తి స్థాయిలో మిద్దెతోటల పెంపకం వైపు మళ్లారు. ఏడాది నుండి సేంద్రియ పద్దతిలో మిద్దెతోట సాగు చేస్తున్నారు.

పూలమొక్కలే కాకుండా ఆకు కూరలు, కూరగాయలు, అరుదైన పండ్లు,ఔషధ మొక్కలని కూడా తన మిద్దెతోటలో సాగు చేస్తున్నారు అదే క్రమంలో అభిరుచికి తగ్గట్టు ఆకర్షణీయంగా చిన్నపాటి తామర పూవుల కొలనుతో పాటు పలు రకాల వృక్ష జాతికి చెందిన మొక్కలను బోన్సాయి పద్ధతితో పెంచుతూ హైడ్రోఫోనిక్ మొక్కలని సాగు చేస్తున్నారు .

మిద్దెతోటని కేవలం కూరగాయలు, పూలమొక్కలకే పరిమితం చేయలేదు వేరుశెనగ, విత్తనాలు లేని పండ్ల జాతి మొక్కలు, రణపాల, మింటూ తులసి, అశ్వగంధ, స్టార్ ఫ్రూట్, నల్ల భామ, కామంచి కాయలు వంటి అరుదైన మొక్కలు ఉషారాణి టెర్రాస్ గార్డెన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటన్నిటిని కూడా గ్రోబ్యాగ్స్, వాడేసిన బకెట్లు, టబ్బులు, వ్యర్థంగా ఉండే కారు టైర్లలో పెంచుతుంది.

తన టెర్రస్ గార్డెన్ లో మొక్కలకు అందించే నీటి విషయంలో తక్కువ ఖర్చు చేసే డ్రిప్ పద్ధతిని పాటిస్తూ మొక్కల ఎదుగుదలకు సేంద్రియ పద్దతిలో తయారు చేసుకున్న జీవామృతాలు,వేస్ట్ డీకంపోజర్ ను ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా మిద్దెతోటలు సాగు చెయ్యడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని అంటుంది ఉషారాణి.

మిద్దెతోటలో ప్రత్యేకంగా ఆహార నిపుణులు ఖాదర్ వలి ప్రేరణతో అటవీ ద్రావణం, నిలువ చేసిన ఆవు పేడను మొక్కల ఎదుగుదలకు ఉపయోగిస్తుంది ఉషారాణి. మరి ఈ అటవీ ద్రావణాన్ని తయారు చేసే విధానం, నిలువ చేసిన ఆవు పేడతో మొక్కలకు కలిగే లాభాలతో పాటు...తన కుమారుడిని సైతం మిద్దెతోటల పెంపకంలో ప్రేరణ కలిగించిన తీరు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories