Organic Poultry Farming: స్టీల్ సిటీలో.... పందెంకోళ్ళు

Organic Poultry Farming on Terrace in Visakhapatnam
x

Organic Poultry Farming: స్టీల్ సిటీలో.... పందెంకోళ్ళు

Highlights

Organic Poultry Farming: ఉన్నత చదువులు చదువుకున్నాడు విదేశాల్లో ఉద్యోగం చేసిన అనుభవం ఉంది.

Organic Poultry Farming: ఉన్నత చదువులు చదువుకున్నాడు విదేశాల్లో ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. స్వదేశంపై ఉన్న ప్రేమతో సొంత ఊరిలో స్థిరపడాలకుని పట్టుదలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. ఓ వైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే వినూత్నంగా మిద్దెపైన కోళ్ల పెంపకం ప్రారంభించి ఆదర్శంగా నిలుస్తున్నాడు విశాఖకు చెందిన న్యూరిద్ధిన్. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఏ మాత్రం అనుభవం లేకున్నా అద్భుతమైన ఫలితాలను అందిపుచ్చుకుంటున్నాడు. మిద్దెపైనే చిన్నపాటి షెడ్డును ఏర్పాటు చేసుకుని జాతి కోళ్లను పెంచుతూ విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు.

విశాఖపట్నంకు చెందిన న్యూరిద్ధిన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. అందుకే ఉద్యోగ రిత్యా ఎంతో బిజీగా ఉన్నా కోళ్లపై మమకారం పెంచుకుంటూ మిద్దె కోళ్ల పెంపకం పనుల్లో నిమగ్నమై ఆహ్లాదరకమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. మొదట్లో కోళ్లు పెంచాలని ఆలోచన ఉన్నా అనుభవం లేదు. అందుకే తెలిసీ తెలియక తప్పటడుగులు వేసినా, తక్షణమే వైద్యుల సూచినలు తీసుకొని, అవగాహన పెంచుకున్నాడు.

మిద్దె కోళ్ల పెంపకం చేసేటప్పుడు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. వాటిని పరిష‌్కరించుకుంటూ మేడ మీద అద్భుతంగా కోళ్లను పెంచుతున్నాడు న్యూరిద్ధిన్. మేడ మీద ఉన్న స్థలాన్ని బట్టి స్లాబ్ పాడవ్వకుండా కోళ్లు ఆరోగ్యకరంగా పెరిగే విధంగా ఒక షెడ్ ను నిర్మించుకున్నాడు. సంవత్సరం క్రితం లక్షా 25 వేల రూపాయల ఖర్చుతో షెడ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

గత ఏడాదిన్నర కాలంగా కోళ్ల పెంపకమ చేస్తున్నానానని, ప్రారంభంలో సమస్యలు వచ్చినా అధిగమించి ముందుకు వెళ్ళానంటున్నాడు న్యూరిద్ధిన్. ఈ కోళ్ల పెంచడానికి కారణం గ్రామలలోనే కోళ్లు పెంచుతున్నారు పట్టణాలలో ఎందుకు పెంచకూడదు అని ,ఆర్గానిక్ ఎగ్స్ ఎందుకు తినకూడదని ప్రయత్నం చేసాను అంటున్నాడు. మొదటలో కోళ్లు పెంపకం పై అవగాహన లేకపోయినా డాక్టర్లను సంప్రదించి అనేక విషయాలు తెలుసుకున్నాని చెప్పాడు. మా అక్క వెటర్నరీ డాక్టర్ కావడంతో ఆమె సూచనలు తీసుకుంటూ కోళ్లు పెంచుతున్నానంటున్నాడు న్యూరిద్ధిన్.

ఒక జాతి కోళ్లను మాత్రమే తీసుకువచ్చి పెంచడం మొదలు పెట్టిన యువకుడు, ఈ కోళ్లను పంధాలకు ఉపాయిగించనని కేవలం ఎగ్స్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నానని అంటున్నాడు. మొదటిలో కోళ్లకు కొన్ని సమస్యలు రావడంతో వాటిపై రిచర్చ్ చేసి ఆ వ్యాధులు రావడానికి గలా కారణాలను తెలుసుకోవడమే కాకుండా కోళ్లు పెంపకంలో అనేక విషయాలు తెలుసుకున్నానని చెబుతున్నాడు.

ప్రస్తుతం మనం తినే ఎగ్స్ లో కెమికల్ కలుస్తుందని, ఇవి తినడం వలన అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నాడు. మనమే కోళ్లు పెంచుకొని వాటి ద్వారా వచ్చే ఎగ్స్ ను తినడం మంచిదనే ఈ కోళ్లు పెంపకం మొదలుపెట్టాను అంటున్నాడు. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆర్గానిక్ ఎగ్స్ దొరుకుతున్నా, పట్టణ ప్రాంతాలలో ఈ ఎగ్ ను మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఆర్గానిక్ ఎగ్స్ లో ప్రోటీన్,మినరల్స్ ఎక్కువ శాతంలో ఉండడం వలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని స్పష్టం చేస్తున్నాడు.

కోళ్లకు పెట్టె మేత కూడా ఇంట్లో ఉండే కూరగాయలు,పళ్ళు,గంట్లు వంటి పదార్ధాలు వేసి పెంచుతున్నామని, అదే పారంలో అయితే వాళ్ళు తయారు చేసిన ఫీడ్ ను కోళ్లకు వేస్తారని,ఆ కోళ్లు మనం తినడం వలన ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటున్నాడు. మొదటిలో తెలియక బియ్యం ఎక్కువుగా వేయడం వలన కోళ్లకు అనేక సమస్యలు వచ్చాయని,తరువాత డాక్టర్ల సలహా మేరకు టీకాలు వేయించిన తరువాత కోళ్లకు ఎటువంటి సమస్య రాలేదని అంటున్నాడు. సిటీలో కోళ్లు పెంచుతున్న తరుణంలో చుట్టుప్రక్కల వాళ్ళు సహాయ సహకారాలు ఎంతో అవసరమంటున్నారు. మొదటిలో కోళ్లు పెంచుతానని ఇంట్లో చెబితే, అందరు వింతగా చూసి ఇంటిపై కోళ్లు పెంచడం ఏంటి అని అన్నారని, తరువాత కుటుంబ సభ్యుల సహకారంతో కోళ్లు పెంచుతున్నానంటున్నాడు న్యూరిద్ధిన్.

మిద్ది పై పౌల్ట్రీ ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగిస్తున్నానని, ఒక జత కోళ్లతో మొదలుపెట్టి ప్రస్తుతం 13 కోళ్లు ను పెంచుతున్ననని అన్నాడు. ఈ కోళ్లను పెంచడానికి నెలకు 2 వేలు వరకు ఖర్చు అవుతుందని, కొళ్లు నుంచి నెలకు సుమారుగా 30 గుడ్లు వరకు వస్తున్నాయన్నారు. సిటీలో ఉన్న వారు పల్లెటూరు వాతావరణంకు దూరం అవుతున్నారని ఆవేదన చెందుతున్నాడు. సిటీలో ఉన్న తమ ఇంట్లో గ్రామ వాతావరణం తెచ్చుకోవచ్చని, సిటీ లో కూడా ఇల్లు మిద్ది పై కోళ్లు పెంచుకోవచ్చని న్యూరిద్ధిన్ అంటున్నాడు.

నేటితరం యువకులు యంత్రాలకు బానిసలవుతున్నారు. ప్రకృతితో మమేకమై గడపాల్సిన సమయాన్ని స్మార్ట్‌ఫోన్‌లు , టీవీలకు కేటాయిస్తున్నారు. ప్రకృతి విషయం పక్కన పెడితే పక్కవాడి విషయం కూడా తెలుసుకోలేని పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఆహార విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లకు ప్రకృతిపై మమకారాన్ని పెంచాలి. తద్వారా ఆహారం, ఆరోగ్యం, పర్యావరణం పట్ల అవగాహన పెరుగుతుంది.

ఒక్కసారి పెట్టుబడి పెడితే సూదీర్ఘకాలం మిద్దె కోళ్ల పెంపకం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు న్యూరిద్దిన్. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం సొంతమవుతుందంటున్నారు. శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందంటున్నారు. తమ కుటుంబాన్ని మాయదారి వైరస్‌ల నుంచి రక్షించుకోవాలనుకునే ప్రతి ఒక్కరు మిద్దె కోళ్ల సాగుకు శ్రీకారం చుట్టాలంటూ పిలుపునిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories