చిరుధాన్యాల సాగులో యువరైతు...

చిరుధాన్యాల సాగులో యువరైతు...
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగు పెరుగుతుంది తక్కువ ఖర్చుతో వర్షాధార పంటగా సాగయ్యే చిరుధాన్యాలను రైతులు ఎక్కువగా పండించడానికి శ్రద్ధ చూపుతున్నారు....

తెలుగు రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగు పెరుగుతుంది తక్కువ ఖర్చుతో వర్షాధార పంటగా సాగయ్యే చిరుధాన్యాలను రైతులు ఎక్కువగా పండించడానికి శ్రద్ధ చూపుతున్నారు. పాత పంటలుగా పేరున్న ఇవి అటు వ్యవసాయ పరంగా ఇటు ఆరోగ్యపరంగాను రైతులకు, వినియోగదారులకు ఇద్దరికీ మేలు చేస్తాయని ఆహార నిపుణులు అంటున్నారు. వ్యయం తక్కువ వ్యవసాయం ఎక్కువ ఉండటం వల్ల రైతులే కాకుండా వివిధ ఉద్యోగాలు చేసే యువత కూడా చిరుధాన్యాలను సాగు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆలాంటి కోవకే చెందుతాడు గుంటూరు జిల్లా కి చెందిన సాఫ్ట్ వెర్ ఉద్యోగి శంకర్.

గుంటూరు జిల్లా మాదిపాడు గ్రామానికి చెందిన శంకర్ బెంగలూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు తనకున్న 10 ఎకరాలని రైతులకి కౌలుకిచ్చాడు కానీ వారు ఒకే రకం పంటలు వేసి నష్టపోవడాన్ని గమనించిన అతడు. తన అన్నయ్య సీతారాం తో కలిసి చిరుధాన్యాలను సాగు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. నిపుణులు, రైతుల సలహా తీసుకుని తన 10 ఎకరాలలో కొర్రలు, సామలు, అండు కొర్రల వంటి రకాల చిరుధాన్యాలని సాగు చేస్తున్నాడు.

తమ గ్రామంలో పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలే ఎక్కువ సాగు చేసినందుకు గతేడాది తీవ్ర నష్టాలు రావడంతో తన తమ్ముడు శంకర్ సూచన మేరకు తక్కువ పెట్టుబడితో చిరుధాన్యాలు సాగు చేస్తున్నామని, పంట దిగుబడి కూడా బాగా రావడంతో ప్రతి ఏడాది రైతులం అంతా కలిసి వీలైనంత ఎక్కువ సాగు చేస్తామంటున్నారు రైతు సీతారాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories