ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అరటి సాగు

ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అరటి సాగు
x
Highlights

పుడమితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి సేద్యమే రైతు ముందున్న ఏకైక మార్గం. ఆరోగ్యవంతమైన నేల, పంట, ఆహారం ఇదే రైతు లక్ష్యంగా మారుతోంది....

పుడమితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి సేద్యమే రైతు ముందున్న ఏకైక మార్గం. ఆరోగ్యవంతమైన నేల, పంట, ఆహారం ఇదే రైతు లక్ష్యంగా మారుతోంది. రసాయనాల సాగు నష్టాలను తెలుసుకుని ప్రకృతి సాగు వైపు అడుగులు వేస్తున్న రైతులు ఎందరో ఉన్నారు అందులో ఒకరు రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు మనోహరా చారి. గతంలో చెరకు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలను ప్రకృతి విధానంలో సాగు చేసి సత్ఫలితాలను సాధించారు ఈ రైతు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా వాణిజ్యపంటైన అరటిని ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు.

నాణ్యమైన అరటి గెలలను వ్యాపారులు అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను గుర్తించిన రంగారెడ్డి జిల్లా , చౌదరి గూడెం మండలం, పద్మారం గ్రామానికి చెందిన రైతు మనోహర చారీ ప్రకృతి విధానంలో అరటి సాగును ప్రయోగాత్మకంగా మొట్టమొదటి సారి చేపట్టారు. టిష్యూకల్చర్‌ జి9 వెరైటీ అరటి మొక్కలను నర్సరీ నుంచి కొనుగోలు చేసారు. సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు.

అరటి సాగులో నూటికి నూరు శాతం ప్రకృతి విధానాలను అనుసరిస్తున్నారు రైతు మనోహరాచారి. మొక్క ఎదుగుదలకు కావాల్సిన బలం మందులను ఎప్పటికప్పుడు క్రమంగా అందిస్తున్నారు. అరిటికి పెద్దగా తెగుళ‌్లు, పురుగుల సమస్య ఉండదని ఒకవేళ వచ్చినా కషాయాలతో వాటిని నివారించవచ్చంటున్నారు ఈ రైతు అరటికి కావాల్సిందల్లా సూక్ష్మపోషకాలేనని అంటున్నారు.

వాణిజ్య పంటల్లో పసుపు, చెరకు, అరటి ముఖ్యమైన పంటలు. పసుపు, చెరకు సాగు తెలంగాణలో అధికంగా ఉన్నప్పటికీ అరటి సాగు అంతగా ఎక్కడా కనిపించదు అయినా సాగుకు అనుకూలమైన నల్లరేగడి నేలలు ఉండడంతో అరటి సాగు చేపట్టారు. పొలాన్ని సిద్ధం చేసుకోవడం దగ్గరి నుంచి మొక్క నాటే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అరటికి అధిక మొత్తంలో నీటి అవసరం ఉండడం వల్ల నీటిని ఆదా చేసుకునేందుకు డ్రిప్‌ పద్ధతిని అనుసరిస్తున్నారు. బలం మందులను సైతం డ్రిప్ ద్వారానే పంటకు అందిస్తున్నారు.

అరటి నాటిన మూడు నెలలకు చెట్టు చుట్టూ పిలకలు వస్తుంటాయి ఈ పిలకలు పెరగడం వల్ల ప్రధాన పంట దెబ్బతింటుంది. తల్లి చెట్టుకుని సరైన క్రమంలో పోషకాలు అందవు బలం తగ్గిపోతుంది. అందుకే ప్రతీ నెల పిలకలను కచ్చితంగా కత్తిరించి వాటినే చెట్టు మొదట్లో సహజ ఆచ్ఛాదనంగా వినియోగించాలంటున్నారు ఈ రైతు. తద్వారా తేమను తట్టుకునే గుణం పాదుకు లభిస్తుందంటున్నారు.

అంతర పంటలు వేసుకోవడం వల్ల రైతుకు రెండు రకాల ప్రయోజనం ఉండాలి. ఒకటి ఆ పంట అమ్మకం ద్వారా రైతుకు అదనపు ఆదాయం దక్కాలి రెండవది పురుగు తెగుళ్లను తట్టుకునే శక్తిని కలిగిన పంటలను అంతర పంటలుగా వేసుకోవడం వల్ల ప్రధాన పంటలో పురుగులను నివారించుకోగలగాలి అని అంటున్నారు ఈ రైతు. అరటి సంవత్సరానికి ఒకసారి మాత్రమే కోతకు వస్తుంది. అందుకే అరటిలో అంతర పంటలను పండిస్తున్నారు ఈ రైతు. మిర్చి, చెర్రీ టమోటాలతో పాటు బంతిని సాగు చేస్తున్నారు.

తెలంగాణ ప్రాంతాంలో నల్లరేగడి నేలలు ఉన్నాయి. నీటి సదుపాయం ఉన్న ప్రాంతంలో అరటిని సాగు చేసుకుంటే రైతుకు ఆర్ధికంగా బాగుంటుంది. అరటి సాగులో పని చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కూలీల అవసరం కూడా పెద్దగా ఉండదు. ప్రభుత్వం కూడా రైతుకు ఆర్ధికంగా సాయం అందిస్తే అరటి సాగుతో రైతు మంచి ఆదాయాన్ని పొందగలడని రైతు మనోహరా చారీ చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories