Old Couple Enjoying Farm Life: అడవిలో వనవాసం.. ఆరుగాలం వ్యవసాయం..

Old Couple Enjoying Farm Life: అడవిలో వనవాసం.. ఆరుగాలం వ్యవసాయం..
x
Highlights

Old Couple Enjoying Farm Life: అదో మారుమూల ప్రాంతం. ఎటు చూసిన విస్తారించిన కొండలు, విశాలమైన తోటలు అలాంటి పచ్చని ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ, పక్షుల కిలకిలారాగాల మధ్య 19 ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా ఇద్దరు దంపతులు అక్కడ జీవనం సాగిస్తోన్నారు.

Old Couple Enjoyed Farm Life: అదో మారుమూల ప్రాంతం. ఎటు చూసిన విస్తారించిన కొండలు, విశాలమైన తోటలు అలాంటి పచ్చని ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ, పక్షుల కిలకిలారాగాల మధ్య 19 ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా ఇద్దరు దంపతులు అక్కడ జీవనం సాగిస్తోన్నారు. ఇంతకీ ఆ దంపతులు అక్కడెందుకు ఉంటున్నారు ఏం చేస్తున్నారు. లెట్స్ వాచ్ ద స్టోరీ.

కరీంనగర్ జిల్లా ర్యాలపల్లి గ్రామానికి చేరువలో ఉంటుంది ఆ ప్రాంతం. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో నెల కిందటి వరకు అక్కడకి చేరుకోవాలంటే కేవలం నడక మార్గం తప్ప వేరే దారి లేదు. ఇటీవలనే వాహనం వెళ్లేందుకు వీలుగా మట్టి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి ప్రాంతంలో గత 19 ఏళ్లుగా ముకుందరెడ్డి అనే రైతు తన భార్యతో ఒంటరిగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేసి మిగితా జీవితాన్ని ఇలా ప్లాన్ చేసుకున్నారు ఆ రైతు దంపతులు.

ప్రకృతితో మమేకమై జీవిస్తోన్న ముకుందరెడ్డి దంపతులు వారి పొలంలో వరి, మొక్కజొన్న, కందులు, మామిడి తదితర పంటలను పండిస్తున్నారు. పంటలే కాకుండా చేపల పెంపకం కోసం ప్రత్యేకంగా తన స్థలంలోనే రెండు చిన్నపాటి కొలనులను ఏర్పాటు చేసుకున్నారు. వీటితో పాటు వివిధ రకాల కూరగాయలను కూడా సాగు చేస్తున్నట్లు వారు చెప్తున్నారు.

చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో తాగునీరు, తినే ఆహారం దొరక్కపోవటంతో పొలంలోకి అప్పుడప్పుడు ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు తదితర వన్యప్రాణులు తరచూ వస్తుంటాయని ముకుందరెడ్డి చెప్తున్నారు. అయితే వాటిని కూడా తన పెంపుడు జంతువుల మాదిరే చూస్తానని, వాటిని చూసినప్పుడు ఎలాంటి భయం కలగదని చెప్తున్నారు. ముకుందరెడ్డి దంపతులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories