బృందావనాన్ని తలపించే మిద్దె తోట

బృందావనాన్ని తలపించే మిద్దె తోట
x
Highlights

ఆరు పదులు దాటిన వయసు, అనుభవం నిండిన జీవితం విశ్రాంతి తీసుకొనే వయసులోనూ ఇంట్లో ఊరికే కూర్చోలేదు ఆ దంపతులు. అంత వయసులోనూ ఇంటి పంటలతో ఇళ్లంతా వనంలా...

ఆరు పదులు దాటిన వయసు, అనుభవం నిండిన జీవితం విశ్రాంతి తీసుకొనే వయసులోనూ ఇంట్లో ఊరికే కూర్చోలేదు ఆ దంపతులు. అంత వయసులోనూ ఇంటి పంటలతో ఇళ్లంతా వనంలా తీర్చిదిద్దారు. శారీరక ఆరోగ్యం, మానసిక ఆనందాన్ని మళ్లీ మిద్దె తోటల పెంపకం ద్వారా పొందుతున్నారు నల్గొండ జిల్లాకు చెందిన దంపతులు రమనమ్మా వెంకటేశ్వర్లు సేంద్రియ విధానంలో ఆరోగ్యాన్ని పండించుకుంటున్న వీరి మిద్దె తోట వి‌శేషాలపై ప్రత్యేక కార్యక్రమం.

మనం తినే ఆహారాన్ని మనమే సొంతంగా పండించుకోవాలనే ఆసక్తి, విష రసాయనాలతో కాకుండా స‍‍‍హజంగా మనింట్లోనే కాయగూరలను పండించుకుని తినాలనే ఆలోచన, వెరసి పూల మొక్కలతో మొదలైన మిద్ద తోట ఇప్పుడు ఇంటిపంటలతో ఒక వనంలా తయారుచేసుకున్నారు దంపతులు రమణమ్మా వెంకటేశ్వర్లు. తమ కూతురిచ్చిన ప్రేరణతో ఇదంతా సాధ్యమైందంటున్నారు దంపతులు రమనమ్మా వెంకటేశ్వర్లు.

మార్కెట్ లో దొరికే పండ్లు, కూరగాయలు, ఆకు కూరల సాగులో రసాయనాల వాడకం మితి మీరుతుంది. అదే క్రమంలో పెరుగుతున్న ధరలు కూడా వినియోగదారులను భయపెడుతున్నాయి. వీటికి పరిష్కారంగా తన మిద్దెతోటలో దాదాపు అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకు కూరలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి మిద్దెతోటలు ప్రామాణికమని అంటున్నారు.

విశ్రాంత ఉద్యోగి అయిన వెంటేశ్వర్లు తన కూతురిచ్చిన సలహాతో మిద్దె తోట సాగును ప్రారంభించారు. ఆరోగ్యకరమైన ఆహారం కావాలంటే రసాయనాలు లేకుండా పండించుకుంటేనే మేలనుకున్న ఆయన సేంద్రియ ద్రావణాలు, కషాయాలు ఉపయోగించి సాగు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories