రైతు ఆలోచన అదిరింది..తనకున్న పరిజ్ఞానంతో..

రైతు ఆలోచన అదిరింది..తనకున్న పరిజ్ఞానంతో..
x
Highlights

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి అరక పశువుల వ్యవసాయం తగ్గిపోతోతంది ట్రాక్టర్లతో సాగు పనులు చేస్తున్నారు రైతులు. ఈ నేపథ్యంలో ఎక్కువగా...

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి అరక పశువుల వ్యవసాయం తగ్గిపోతోతంది ట్రాక్టర్లతో సాగు పనులు చేస్తున్నారు రైతులు. ఈ నేపథ్యంలో ఎక్కువగా చదువుకొకపోయిన తనకున్న పరిజ్ఞానంతో పసుపు పంటను సాగు చేయడానికి వినూత్న పరికరాన్ని ఆవిష్కరించాడు ఆ రైతు. పరికరం ఒకటే అయిన రెండు పనులు చేసేలా సరికొత్త యంత్రాన్ని రూపొందించాడు. తక్కువ ఖర్చుతో యంత్రాన్ని తయారు చేయించుకుని సాగు ఖర్చులను తగ్గించుకుని వ్యవసాయంలో ముందుకు సాగుతున్న నిజామాబాద్ జిల్లా యువ రైతు పై ప్రత్యేక కథనం.

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన రైతు లింగారెడ్డి. గత కొంత కాలంగా పసుపు సాగుచేస్తున్నాడు ఈ రైతు. బెడ్ పద్ధతిలో పసుపు సాగు చేయాలంటే కూలీల అవసరం ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో అరక పశువుల అద్దె, కూలీల ఖర్చులు పెరగడంతో సాగు పెట్టుబడులు పెరిగిపోయాయి. దీంతో ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనతో పెద్దగా చదువుకోకపోయినా ఓ కొత్త యంత్రాన్ని తన పరిజ్ఞానాన్ని ఉపయోగిచి తయారు చేశాడు సత్ఫలితాలను సాధిస్తున్నాడు.

ఒకే యంత్రంతో రెండు పనులు చేసేలా యంత్రాన్ని రూపొందించాడు. బోయ, బెడ్ పద్ధతిలో పసుపు విత్తేందుకు, అంతర పంటగా మొక్కజొన్నను విత్తేలా పరికరాన్ని తయారు చేశాడు. ఈ యంత్రం తయారీ కోసం 40 వేల రూపాయలు ఖర్చు చేసాడు లింగారెడ్డి. ట్రాక్టర్ సాయంతో రెండు గంటల్లో ఒక ఎకరం పసుపు, ఒక ఎకరం మొక్కజొన్నను విత్తుతున్నాడు.

అరక పశువులు లేకపోవడంతో పాటు పసుపును రెండు విధాలుగా వేసుకునే విధంగా యంత్రాన్ని తన ఆలోచనలతో తయారు చేసుకున్నాడు. ఈ పరికరంతో బోదె పద్ధతిలో ఒకటిన్నర అడుగుల దూరంగా విత్తు వేస్తుంది. బెడ్ పద్దతికైతే మూడు అడుగుల దూరంలో ఒక అడుగు ఎత్తులో రెండు వరుసలు పసుపు వేసుకోవచ్చు. అంతే కాకుండా వరుసలో సైజ్ లు మార్చుకొనేల యంత్రాన్ని తయారు చేయించుకున్నాడు. ఒకేసారి నలుగురు మనుషులు కూర్చొని నాలుగు వరుసల పసుపు వేసుకోవచ్చు. నాలుగు వరుసల మొక్కజొన్న ను వేసుకోవచ్చు. రెండు గంటల్లో ఒక ఎకరం పసుపు విత్తుకోవచ్చని లింగారెడ్డి చెబుతున్నాడు.

ఉద్యానవన శాఖ అధికారులు సబ్సిడీపై ఇచ్చే పరికరం ధర ఎక్కువ అంతేకాకుండా రైతులకు ఇది ఉపయోగకరంగా ఉండకపోవడం వల్ల ఈ పరికరాన్ని తయారు చేయించాడు. గత ఏడాది ఈ యంత్రంతో తన ఐదు ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న ను వేసుకున్నానని దీంతో అరక ఎద్దులు, కూలీలా ఇబ్బంది పోయిందని యువ రైతు అంటున్నాడు. ఈ పరికరాన్ని చూసిన చుట్టు పక్కల గ్రామాల రైతులు లింగరెడ్డిని అభినందిస్తున్నారు. ఇలాంటి యంత్రాన్ని సబ్సిడీపై రైతులకు ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories