రైతు అరచేతిలో సాగు సమస్త సమాచారం

రైతు అరచేతిలో సాగు సమస్త సమాచారం
x
Highlights

సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందుకోగలరా ఆండ్రాయిడ్ మొబైల్ తో సాగుపద్ధతుల సలహాలు పొందగలరా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు లేకుండా నూతన సాగు...

సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందుకోగలరా ఆండ్రాయిడ్ మొబైల్ తో సాగుపద్ధతుల సలహాలు పొందగలరా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు లేకుండా నూతన సాగు పద్ధతులను ఎలా తెలుసుకోవాలి మట్టిని బట్టి ఏ పంట వేయాలో తెలుసోకోవడానికి మొబైల్ ఉంటే చాలా అంటే అవుననే అంటున్నారు రైతులు కొత్త పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ ఇప్పుడు రైతులకు 24/ 7 సలహాల పెట్టగా మారుతుతుంది ఇంతకి ఆ యాప్ ఏంటి అది అందించే సేవలేంటో తెలుసుకుందాం.

అన్నంపెట్టే రైతన్నకు ఆసరాగా నిలిచిన నాయకుడు లేడు అంటే అతిశయోక్తికాదు దేశానికి రైతే వెన్నుముక అని సభల్లో ప్రసంగలు దంచి చెపుతుంటారు. కానీ వరంగల్ కి చెందిన నవీన్ అనే యువకుడు మాత్రం వట్టిమాటలు కట్టిపెట్టి రైతుకు మేలు తలపెట్టాలనుకున్నాడు. మొబైల్ యాప్ ను తయారుచేశాడు ఈ యాప్ లో రైతులు నేల తయారీ దగ్గరి నుంచి ఏ పంటకు ఏ విత్తనాలు వాడాలి, దానికి వచ్చే తెగుళ్లు ఏంటి , వాటికి ఎలాంటి చికిత్స చేయాలి సమృద్ధిగా పంటను ఎలా పండించాలి, పండిన పంటను ఏ మార్కెట్ లో గిట్టుబాటు ధర కు అమ్మాలి అనే పూర్తి సమగ్రమైన సమాచారాన్ని పొందుపరిచారు. ఇది మాతృభాష తెలుగులో తయారు చేయడం తెలుగు రాష్ట్రాల రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

రైతుల ఆత్మహత్యలు, వారి కష్టాలను చూసి అన్నంపెట్టే రైతన్న కోసం ఏదోఒకటి చేయాలన్న ఆలోచనతో ఈ యాప్ రూపకల్పన చేశానంటున్నారు నవీన్. దీనిపై ఒక సంవత్సరం పాటు కసరత్తు చేశాక ఈ యాప్ కి తుదిమెరుగులు దిద్దారు ICRISAT, ప్రోఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల సలహాలు సూచనలతో ఈ యాప్ లో రైతులకు అవసరమయ్యే సమాచారాన్ని పొందుపరిచారు. ఇప్పటి వరకు 120 రకాల పంటలకు సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరిచం అని అంటున్నారు నవీన్ . రానున్న రోజుల్లో ఈ యాప్ ని మరింతగా రైతులకు చేరువయ్యలే చేస్తామని చెబుతున్నారు.

రైతులకు నాపంట మొబైల్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంది ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది అందులో ఫేస్ బుక్, వాట్సాప్ లాగానే ఈ యాప్‌ను కూడా సెల్ ఫోన్ లో డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ప్రతి రైతు ఇంట్లో ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నట్లే ఉపయగపడతుందని వరంగల్ అర్బన్ జిల్లా యువ రైతు సురేష్ తెలిపారు. ఇది చాలా సులభతరంగా వాడేలా తయారు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగ పడుతుందని చెబుతున్నాడు. ప్రతి గ్రామానికి వ్యవసాయ అధికారులు గాని శాస్త్రవేత్తలు గాని పోలేరు అలాంటి చోట ఈ యాప్ వల్ల ప్రతి ఒక్క విషయం తెలుసుకోగలుతున్నామంటున్నారు.

ఈ యాప్ ని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 1 లక్ష 32 వేల మంది రైతులు వినియోగిస్తున్నారు. ఇందులో అన్నిరకాల విత్తన కంపిణీల సమాచారం, ఎరువుల కంపిణీల సమాచారం, వ్యవసాయ పరికరాల కంపిణీల సమాచారం, పరికారల్లో నూతన టెక్నాలజీ తో వచ్చిన వాహనాలు వాటి వివరాలు, వాటి ఉపయోగం ఇలా సమగ్ర సమాచారం ఉంది. వీటితో పాటు ఏ పంటకు ఏ మార్కెట్ లో ఏ రోజు ఎంత ధర పలికింది. ఏ పంటకు ఏ మార్కెట్ లో గిట్టుబాటు ధర ఉంది. రైతు ఎక్కడ అయితే లబదాయకమైన ధర కు అమ్మకోవచ్చో ఇలా ప్రతి సమాచారం ఈ యాప్ లో పొందుపరిచారు. దీనితోపాటు కూరగాయల పంట రకాలకు, వారి వంగడలకు, జొన్న, మొక్కజొన్న, పత్తి, మిర్చి, పసుపు వారి పంటలకు వచ్చే తెగుళ్లు , వాటి నివారణ చర్యలు, వాటికి ఉపయోగించే రసాయనాలు, ఎరువులు ఇలా ప్రతి ఒక్క సమాచారం ఇందులో పొందుపరిచారు. ఈ సమాచారం అంత కూడా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలతో రూపొందించడం చాలా గొప్ప విషయం. ప్రతిదీ రైతు ప్రాక్టీకల్ గా చేసే వ్యవసాయ సాగు పద్దతులో స్థానిక తెలుగు భాషలో అందుబాటులో ఉంచారు.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పలు రకాల భూములు మనకు కనిపిస్తుంటాయి. ఒకే చోట రెండు రకాల భూములు ఉంటుంటాయి. అందులో నల్లరేగడి, రేగడి, ఎర్రనేలాలు, చౌడు భూములు, చెలక భూములు, ఇలా రకాల భూములు మనకు కనిపిస్తుంటాయి. ఆ భూముల్లో ఏ సీజన్ లో ఏ పంట శ్రేయస్కరం అనే సమాచారం కూడా పొందుపరిచారు. అభూమిలో వ్యవసాయ యోగ్యమైన బలం ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి భూసారా పరీక్షలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి ఎప్పుడు ఈ పరీక్షలు చేయించాలి వాటి ఉపయోగం ఎంత ఇలా పూర్తి భూసార పరీక్షల సమాచారం ఇందులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories