తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు

తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు
x
Highlights

ప్రకృతి సిద్ధంగా లభించే పట్టు నాలుగు రకాలు. 'మల్బరీ' , 'మూగ' , 'ఇరి', 'దసళీ' పట్టు. వీటిలో మల్బరీ పట్టుకు ప్రేత్యేకమైన స్ధానం ఉంది. మన తెలంగాణ...

ప్రకృతి సిద్ధంగా లభించే పట్టు నాలుగు రకాలు. 'మల్బరీ' , 'మూగ' , 'ఇరి', 'దసళీ' పట్టు. వీటిలో మల్బరీ పట్టుకు ప్రేత్యేకమైన స్ధానం ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మల్బరిని విరివిగా సాగు చేస్తూ, మల్బరీ పట్టు ఉత్పత్తిలో ప్రాముఖ స్ధానం పోషిస్తున్నాయి. ఆ కోవలోనే మంచిర్యాల జిల్లాలో లాభాలు ఆర్జించే దిశగా మల్బరీ తోటల సాగు చేస్తున్నారు అక్కడి రైతులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గుల్లకోట గ్రామానికి చెందిన గుర్రాల బుచ్చిరెడ్డి, గుర్రాల రాజిరెడ్డిల మల్బరీ సాగుపై ప్రత్యేక కథనం.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గుల్లకోట గ్రామంలో పలువురు రైతులు వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులను ఆరంభిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. హార్టికల్చర్‌ అధికారుల ప్రోత్సాహంతో మల్బరీ తోటలు సాగు మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుంది. హార్టికల్చర్‌ అధికారులు సలహాలు సూచనలు పాటిస్తూ పంట సాగు చేస్తూ తక్కువ కష్టంతో తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. ఈ విషయాన్ని మల్చరీ తోట సాగు చేస్తున్న రైతులు చెప్తున్నారు.

హార్టికల్చర్‌ అధికారుల సలహాలతో మల్బరీ తోట సాగు చేయడానికి అనువైన ఎర్ర నేలలు వంటి భూముల్లో లాభాలు పొందవచ్చని మల్బరీ తోట సాగుకు ప్రభుత్వం మొక్కలను సబ్సిడీ రూపంలో అందజేస్తూ రైతులకు మల్బరీ సాగుకు ప్రోత్సహిస్తూ ఉంది. రైతులు సాగు చేస్తామని దరఖాస్తు చేసుకున్న మొదలు నుండి పంట మార్కెట్‌ కి తీసుకెళ్లే వరకు ప్రభుత్వం పెట్టుబడిలో సగభాగం సబ్సిడీ రూపంలోనే చెల్లిస్తుంది. మొక్క నుండి తీసుకువచ్చిన మల్బరీకి ప్రతి సంవత్సరానికి 36 వేల రూపాయలు సబ్సిడీని హార్టికల్చర్‌ శాఖ అందజేస్తుందని రైతులు చెప్తున్నారు.

మల్బరీ సాగు పట్టు ఉత్పత్తిలో రెండు దశలు ఉంటాయి. మొదటిది మల్బరీ పంట సాగు, రెండోది మల్బరీ ఆకులు తినిపించి పట్టు పురుగులను పెంచడం. మొదట 8 నెలల పాటు మల్బరీ తోటను పెంచుతారు. మల్బరీ పంటకు ఎకరాకు సుమారు రూ.10 వేలు ఖర్చవుతుండగా, సుమారు రూ. 50 వేల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మల్బరీ తోటను ఒకసారి నాటితే 20 సంవత్సరాల పాటు సాగు చేయవచ్చని అంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories