బంతి పూల సాగు..ఈసారి రైతన్నకు దిగులు!

బంతి పూల సాగు..ఈసారి రైతన్నకు దిగులు!
x
Highlights

ముద్దుగొలిపే బంతిపూలు ఇప్పుడు రైతులను ఏడిపిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా బతుకమ్మ సీజన్ లోనూ బతుకమ్మ పూలకు డిమాండ్ లేకుండా పోయింది. రైతులకు భారంగా...

ముద్దుగొలిపే బంతిపూలు ఇప్పుడు రైతులను ఏడిపిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా బతుకమ్మ సీజన్ లోనూ బతుకమ్మ పూలకు డిమాండ్ లేకుండా పోయింది. రైతులకు భారంగా మారిన బంతి సాగుపై ఓ కథనం.

కరీంనగర్ జిల్లా పరిధిలోని తిమ్మాపూర్ లో అత్యధికంగా రైతులు దసరా, బతుకమ్మ, దీపావళి పండగల్ని దృష్టిలో పెట్టుకొని బంతి సాగు చేశారు. తెలంగాణలో పూలతో జరుపుకునే పండుగా బతుకమ్మ. ఈ పండుగకు తంగెడు పువ్వు, గునుగు పువ్వులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో బంతి పూలకు సైతం అలాంట ప్రాముఖ్యత ఉంటుంది. ఐతే, అనుకోకుండా వచ్చిన కరోనాతో పాటుగా ఇటివల కురిసిన వర్షాలతో తీవ్ర నష్టాలను చవి చూసారు.

రైతులంతా బంతిసాగు కోసం ఎకరాకు 50 వేల పెట్టుబడి పెట్టి లక్షన్నర నుంచి 2 లక్షల లాభాలను గడించేవారు. శ్రావణ మాసంలో జరిగే పెళ్లిళ్లు ఆ తరువాత దసరా, బతుకమ్మ సీజన్ తో పాటు కార్తీక మాసంలో జరిగే శుభకార్యలకు మూడు విడతలు గా బంతి పూల కోత ఉండేది. ఒక్క సాగులో మూడు సార్లు పూలను తెంపుతారు. కానీ ఈ సీజన్ లో ఒక్కసారి కూడ పూలను కోయలేదు.

కరోనా విస్తరణతో శుభకార్యక్రమాలు అంతంత మాత్రంగానే జరిగాయి. కిలో 80 నుంచి వంద రూపాయలకు అమ్మాల్సిన బంతి పూలను దళారులు 30 రూపాయలకే అడుగుతుండడంతో పెట్టుబడి కూడ వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బంతి పూవు మొగ్గ దశలో ఉండగా, పొలాల వద్దకే దళారులు వచ్చి గంపగుత్తగా మాట్లాడుకోని అడ్వాన్సులు చెల్లించేవారు. కాని ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories