ఆరోగ్యకరమైన సమాజాన్ని నెలకొల్పడమే అతని లక్ష్యం

ఆరోగ్యకరమైన సమాజాన్ని నెలకొల్పడమే అతని లక్ష్యం
x
Highlights

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదాయం, అధిక దిగుబడికి ఆశపడి రైతులు మితిమీర రసాయనాలను వినియోగించి పంటలను...

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదాయం, అధిక దిగుబడికి ఆశపడి రైతులు మితిమీర రసాయనాలను వినియోగించి పంటలను సాగు చేస్తున్నారు. తద్వారా ఈ పంట ఉత్పత్తులను తిన్న ప్రజలు రోగాల బారినపడతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు కష్టమని భావించాడు మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన రైతు దామోదర్ రెడ్డి. గత 12 సంవత్సరాలుగా ప్రకృతి సేద్యాన్ని ఓ ఉద్యమంలా కొనసాగిస్తున్నాడు. అందరికంటే భిన్న పద్ధతిలో ప్రకృతి విధానంలో పసుపును సాగు చేస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణాని దోహదపడుతున్నడు.

అధిక దిగుబడులకు ఆశపడి రైతులు రసాయనాల సాగుకు అలవాటు పడ్డారు. మొదట పంట దిగుబడి పెరిగి మంచి ఆదాయాన్ని పొందిన రైతులు నేడు రసాయనాల వినియోగం పెరిగి నేలలు నిస్సారం కావడంతో పంటలు తెగుళ్లు, పురుగుల బారిన పడి నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పంట ఉత్పత్తులే కాదు నేలలు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాయి. కొన్ని రోజులు ఇలాగే గడిస్తే పంట మొలకెత్తడం కూడా కష్టమేనని భవిష్యత్తును ఊహించుకున్నాడు ఈ రైతు. అందుకే రసాయనాలు రాజ్యమేలుతున్నా గత 12 సంవత్సరాలుగా ప్రకృతి సేద్యాన్ని చేస్తూ సాగులో రారాజుగా నిలుస్తున్నారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు.

ఈ రైతు పెరు గంట దామోదర్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన ఈ రైతు గత 12 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతిలో లభించే వనరులతో తనకున్న 8 ఎకరాల పొలంలో పసుపును పండిస్తున్నారు. పసుపులోనూ 9 రకాలను పండిస్తున్నారు ఈ రైతు.

పసుపులో అంతర పంటలుగా ఆవాలు, పల్లీలు, మొక్కజొన్న ఇలా మూడు పంటలను పసుపు దిగుబడి వచ్చే వరకు పండిస్తున్నాడు. కాలానికి అనుగుణంగా అంతర పంటలను సాగు చేస్తున్నాడు. తద్వారా పెట్టుబడిని తగ్గించుకుంటూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు.

మార్కెట్‌కు వెళ్లి తోటి రైతుల్లా తన వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోడు ఈ రైతు. ఇంట్లోనే ప్రాసెసింగ్ చేసుకుని నిల్వ చేసి వాటిని ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. ప్రకృతి పరంగా పండిన తన పంటకు డిమాండ్ ఉండడంతో అధిక ధరకు విక్రయిస్తున్నాడు.

ప్రకృతి ఎరువులను పంటపై పిచికారీ చేస్తుండడం వల్ల పంట ఉత్పత్తులు ఎంతో నాణ్యంగా ఉంటున్నాయి. దీంతో తోటి రైతులు విత్తనాల కోసం ఈ రైతును ఆశ్రయిస్తున్నారు. అంతే కాదు తన దగ్గరకు వచ్చిన రైతులకు సాగులో తగు సూచనలను చేస్తున్నారు. వారికి ప్రకృతి సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు.

రసాయనాల మయం అవుతున్న నేలలను సారవంతం చేసి నాణ్యమైన పంట ఉత్పత్తులను పండించి, ఆరోగ్యకరమైన సమాజం నిర్మించాలన్నది ఈ రైతు ధ్యేయం అందుకోసం నిరంతరం కృషి చేస్తానంటున్నాడు ఈ రైతు. ప్రభుత్వం కూడా తెలంగాణలో ప్రకృతి సాగును ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories